Salmonella : అమెరికాలో సాల్మొనెల్లా వ్యాప్తి

Salmonella :  అమెరికాలో సాల్మొనెల్లా వ్యాప్తి
ఉల్లిపాయలు కట్ చేసి నిల్వ ఉంచటమే కారణం

అమెరికాను సాల్మొనెల్లా బ్యాక్టీరియా కలవరపెడుతోంది. 22 అమెరికా రాష్ట్రాల్లో సాల్మొనెల్లా వ్యాప్తి 73 మందిని ప్రభావితం చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) ప్రకారం ఈ వ్యాప్తికి ముక్కలుగా చేసిన ఉల్లిపాయాలు కారణమవుతున్నాయని తేలింది. ఇప్పటి వరకు 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఎలాంటి మరణాలు సంభవించలేదు. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటే అవకాశం ఉందని, చాలా మంది ప్రజలు పెద్దగా వైద్య పరీక్షలు లేకుండా కోలుకోవడంతో ఖచ్చితమైన సంఖ్యను గుర్తించలేదు.


సాల్మోనెల్లా అనేది ఆహారం ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్. ముఖ్యంగా నిల్వ ఉంచే ఆహారంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వాటి పొరపాటున ఎవరైనా తిన్నారంటే ఇన్ఫెక్షన్లతో అస్వస్థతకు గురవ్వుతారు. CDC అంచనా ప్రకారం.. ఏటా 1.35 మిలియన్ ఇన్ఫెక్షన్లకు సాల్మొనెల్లా కారణమవుతోంది. ఈ ఇన్ఫెక్షన్‌ను ‘సాల్మోనెలోసిస్’ అని కూడా పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారికి విరేచనాలు లేదా రక్త విరేచనాలు, జ్వరం, కడుపు తిప్పడం లేదా గందరగోళంగా ఉండటం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ లక్షణాలు నాలుగు నుంచి ఏడు రోజుల వరకు ఉంటాయట. అయితే, కొందరిలో మాత్రం చాలా వారాలపాటు ఈ ఇన్ఫెక్షన్ తిష్ట వేస్తుందట. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనికి చికిత్స అందుబాటులో ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ సొకినప్పుడు నీరు ఎక్కువ తాగాలి. తగినంత విశ్రాంతి అవసరం. అయితే కొందరిలో మాత్రం ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందట. ముఖ్యంగా పిల్లలకు ఇది సోకితే చాలా ఇబ్బందిపడగతారు.


కాలిఫోర్నియాకు చెందిన గిల్స్ ఆనియన్స్ అనే కంపెనీ డైస్ చేసిన ఎల్లో ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు, ఉల్లిపాయలను, సెలెరీల ప్యాకెట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున గిల్స్ ఉల్లిపాయలను స్వచ్ఛందంగా రీకాల్ చేసింది. అరిజోనా, కాలిఫోర్నియా, ఇడాహో, మోంటానా, ఒరెగాన్, వాషింగ్టన్ ఆరు రాష్ట్రాలకు సరఫరా చేయబడిన ఉత్పత్తుల వినియోగించే తేదీ ఆగస్టు 2023కు మించి ఉన్నాయి, దీంతో స్టోర్లలో ఇకపై అందుబాటులో ఉండవని కంపెనీ తెలిపింది.రీకాల్స్ చేసిన ఉల్లిపాయలను తినవద్దని సీడీఎస్ ప్రజలకు సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story