శాం‌సంగ్‌ చైర్మన్‌ లీకున్‌ కన్నుమూత

శాం‌సంగ్‌ చైర్మన్‌ లీకున్‌ కన్నుమూత
గ్లోబల్ టెక్ టైకూన్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ కున్-హీ ఆదివారం మరణించారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లీ..

గ్లోబల్ టెక్ టైకూన్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ కున్-హీ ఆదివారం మరణించారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లీ.. ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ తెలిపింది. లీ నాయకత్వంలో, శామ్సంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌, మెమరీ చిప్‌ల ఉత్పత్తిదారుగా ఎదిగింది, అంతేకాదు సంస్థ యొక్క మొత్తం టర్నోవర్ నేడు దక్షిణ కొరియా యొక్క జిడిపిలో ఐదవ వంతుకు సమానంగా ఉంది.

లీ కొరియాలోని డేగులో 1942 జనవరి 9న జన్మించారు. శాంసంగ్‌ వ్యవస్థాపకుడైన ఆయన తండ్రి లీ బైంగ్‌ చుల్‌ మరణం అనంతరం లీ శాంసంగ్‌ బాధ్యతలను చేపట్టారు. కాగా లీకి 2014లో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story