Sankranthi: పల్లెకు పండగొచ్చే... రహదారులు కిటకిటలాడే...

Sankranthi: పల్లెకు పండగొచ్చే... రహదారులు కిటకిటలాడే...
పెద్ద పండగ కోసం సొంత ఊళ్లకు పయనమైన జనాలు; సీటీకి తగ్గిన కళ, కిటకిటలాడుతున్న రహదారులు...

సంక్రాంతి పండుగ అంటే ఎక్కడ ఉన్నా రెక్కలుకట్టుకుని సొంతగూటికి చెక్కేయాల్సిందే మరి. అందుకే అప్పుడే సగం నగరం ఖాళీ అయిపోయింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సగానికిపైగా తగ్గిపోయింది. అయితే హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై రష్‌ పెరిగిపోయింది.. సంక్రాంతి సెలవులు రావడంతో జనమంతా సొంతూళ్ల బాట పడుతున్నారు.. కొందరు బస్సుల్లో వెళ్తుంటే, చాలా మంది సొంత వాహనాల్లో పల్లెబాట పడుతున్నారు.. దీంతో నేషనల్‌ హైవేపై వాహనాల బారులు కనబడుతున్నాయి.. ఇక టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలతో రద్దీ పెరిగిపోతోంది.. కంచికచర్ల వద్ద ఉన్న కీసర టోల్‌ ప్లాజా దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయని తెలుస్తోంది.



మరోవైపు వాహనాల రాకపోకలతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద రష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ అండ్ స్టిక్, ఫాస్ట్ ట్యాగ్ హ్యండెల్ రిడర్, ఫాస్ట్ ట్యాగ్ స్కానర్‌లను ఏర్పాటు చేశారు.. వీటి సాయంతో టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. టోల్‌ బూత్‌లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేయడంతో రద్దీ లేకుండా వాహనాలు తొందరగా వెళ్తున్నాయి.



మరోవైపు ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వచ్చే వాహనాలకు అదనపు రుసుము వసూలు చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మూడు విధానాలతో రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. జీఎంఆర్ అధికారులు చర్యలతో టోల్ ప్లాజ్ వద్ద రష్ పూర్తిగా తగ్గుతోంది. కొత్త విధానంతో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని వాహనదారులు చెబుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story