Miss Universe 2024: మిస్‌ యూనివర్స్‌ పోటీలో సౌదీ సుందరి

Miss Universe 2024:  మిస్‌ యూనివర్స్‌ పోటీలో  సౌదీ సుందరి
సౌదీ అరేబియా సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియాసంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం రుమీ అల్ఖాతానీని ఈ పోటీల‌కు ఎంపిక చేసింది. ఈ మేర‌కు రుమీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఈ విష‌యాన్ని సోమ‌వారం తెలియ‌జేశారు.

ఇస్లామిక్‌ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే ఫ్యాషన్‌ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్‌ యూనివర్స్‌ 2024 అందాల పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా పోటీ చేయనుంది. దీంతో సౌదీ అరేబియావైపు ప్రపంచ దేశాలన్నీ తొంగి చూస్తున్నాయి. ఈ విషయాన్ని రుమీ అనే మోడల్‌ త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా సోమ‌వారం తెలియ‌జేశారు. ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్టుకు త‌న‌కు సంబంధించిన‌ కొన్ని అంద‌మైన ఫొటోల‌ను కూడా జ‌త చేశారు.

ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ 'ఖ‌లీజ్ టైమ్స్' ప్ర‌కారం.. సౌదీ అరేబియాలోని రియాద్ న‌గ‌రానికి చెందిన రుబీ అల్ఖాతానీ ఇప్ప‌టికే ప‌లు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొన్ని వారాల క్రితం మ‌లేషియాలో జ‌రిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబ‌ల్ ఏషియ‌లోనూ ఆమె పాలుపంచుకున్నారు.కాగా 73వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 28 మెక్సికో వేధికగా నిర్వహించనున్నారు. ఇందులో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొంటోంది.

కాగా, గ‌తేడాది మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని మిస్ నికరాగ్వా షెన్నిస్ పలాసియోస్ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ఈ అందాల పోటీల్లో మొదటి సారి నికరాగ్వా నుండి ఒక పోటీదారు విజేతగా నిల‌వ‌డం విశేషం. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్, ఆస్ట్రేలియాకు చెందిన మొరయా విల్సన్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఇక ఈసారి మిస్ యూనివ‌ర్స్ పోటీలు మెక్సికోలో జరగుతాయ‌ని నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. ఈ పోటీల్లోనే ఇప్పుడు సౌదీ అరేబియా తొలిసారి భాగం కానుంద‌న్న మాట‌.

Tags

Read MoreRead Less
Next Story