అంటార్కిటికా మంచు కింద వింత జీవి.. !

అంటార్కిటికా మంచు కింద వింత జీవి.. !
అంటార్కిటికా ఖండం పూర్తిగా మంచు ప్రదేశం అన్న సంగతి తెలిసిందే.. సూర్యకాంతి కూడా ప్రవేశించని ఈ ప్రదేశంలో జీవం జీవించడం అనేది అసాధ్యం.

అంటార్కిటికా ఖండం పూర్తిగా మంచు ప్రదేశం అన్న సంగతి తెలిసిందే.. సూర్యకాంతి కూడా ప్రవేశించని ఈ ప్రదేశంలో జీవం జీవించడం అనేది అసాధ్యం.. అయితే అంటార్కిటికా మంచు పర్వతాల అడుగున, దాదాపు 3000 అడుగుల (900 మీటర్ల) లోతున జీవం ఉనికిని తొలిసారిగా బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటిష్​ అంటార్కిటిక్​ సర్వే (బాస్​) శాస్త్రవేత్తలు అంటార్కిటికాలోని ఓ దట్టమైన ఐస్​ షీట్​కు రంద్రం చేసి అందులోకి కెమెరాను పంపించి పరిశీలిస్తుండగా వారికి అడుగుభాగంలోకి పంపిన కెమెరాకు ఓ వింత జీవి కనిపించింది. స్పాంజ్ ఆకారంలో ఉన్న ఓ వింత జీవి అడుగుభాగంలో కనిపించింది. ఈ జీవిని చూసి శాస్త్రవేత్తలు ముందుగా షాక్ అయ్యారు. ఈ వింతైన జీవులు అలాంటి పరిస్థితుల్లో కూడా జీవించడం అరుదైన విషయం అని బ్రిటన్ శాస్త్రవేతలు అంటున్నారు. అయితే ఈ జీవుల ఏ జాతికి సంబంధించినవి, వాటి మనుగడ ఎలా ఉంటుందనే దానిపైన పరిశోధనలు చేస్తున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.


Tags

Read MoreRead Less
Next Story