అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధం

అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధం
యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని..

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని.. కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు.. వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను వృద్ధి చేశామని ప్రకటించింది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధమైంది. నవంబర్‌ 1 నుంచి టీకాను ప్రజలకు పంపిణీ చేయాలని... ఆదేశంలోని రాష్ట్రాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు వ్యాక్సిన్‌ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది. రాష్ట్రాలు, వైద్యశాఖలు, ఆసుపత్రులకు... సెంటర్‌ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-CDC ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది.

నవంబర్‌ 1 నాటికి సమర్ధవంతమైన కొవిడ్ టీకాను.. ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధం కావాలంటూ.. రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్టు అమెరికన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అవసరమైన వసతులపై దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ.. గత నెల 27న CDC డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ రాసిన లేఖలో పేర్కొన్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందే వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు.. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తుది ఆమోదానికి చేరువలో ఉందంటూ.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అలాగే వ్యాక్సిన్‌ అభివృద్ధి.... దాని పంపిణీ విషయంలో పర్సరం సహకరించుకునేందుకు ఏర్పడిన ప్రపంచ దేశాల కూటమితో తాము కలిసి నడవబోమని కూడా అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో వివిధ ప్రయోగ కేంద్రాలు 30 వేల మంది వాలంటీర్లను నమోదుచేసుకున్నాయని... ఆస్ట్రాజెనికా వెల్లడించింది. ఈ వాలంటీర్లంతా 18 ఏళ్ల పైబడినవారేనని... వివిధ సంస్కృతులు, జాతులు, భౌగోళిక ప్రాంతాలకు చెందినవారు వీరిలో ఉన్నట్టు పేర్కొంది.

అయితే... అధ్యక్ష ఎన్నిక్లో గెలుపు కోసం ట్రంప్‌ అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హడావుడిగా ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్‌ విడుదల చేయాలని CDCపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గిన అధికారులు అక్టోబర్‌ చివరినాటికే రెండు వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది, సీరియస్ పేషంట్లకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దిశగా దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాలు, 5 ప్రధాన నగరాల అధికారులను CDC అధికారులు సంప్రదించించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఆస్ట్రాజెనికా, మోడెర్నా, ఫైజర్‌ సంస్థలు తలమనకలై ఉన్నాయి. వీటిని.. అక్టోబర్‌ చివరి నాటికే.. వైద్య సిబ్బంది, సీరియస్ పేషంట్లకు అందించాలని ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు.. అయితే ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్.. వ్యాక్సిన్ పాలిటిక్స్‌తో గట్టెక్కాలని చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story