Plane Crash: కుప్పకూలిన విమానం.. ఆరుగురు మృతి

Plane Crash:  కుప్పకూలిన విమానం.. ఆరుగురు మృతి
ర‌న్‌వే నుంచి టేకాఫ్ తీసుకుంటుండగా ప్రమాదం

కెనడాలోని రిమోట్ నార్త్ వెస్ట్ టెరిటరీస్ సమీపంలో ఒక చిన్న విమానం కూలిపోయింది. కెన‌డాలో విమానం కూలిన ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెందారు. చిన్న‌పాటి కంమ్యూట‌ర్ ప్లేన్‌లో గ‌ని కార్మికుల‌ను త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో ఆ విమానం కూలింది. ఈ ఘ‌ట‌న వాయ‌వ్య కెన‌డా ప‌ర్వ‌త ప్రాంతాల్లో చోటుచేసుకున్న‌ది. ప్ర‌మాదంలో ఒక వ్య‌క్తి ప్రాణాల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అత‌ని ప‌రిస్థితి గురించి వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించ‌లేదు. ఫోర్ట్ స్మిత్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్ష‌ణాల‌కే ఆ విమానం నుంచి సంబంధాలు తెగిపోయిన‌ట్లు ఒంటారియోలోని రెస్క్యూ సెంట‌ర్ తెలిపింది. నార్త్‌వెస్ట్ర‌న్ ఎయిర్ కంపెనీకి చెందిన ట్విన్ ట‌ర్బో విమానం ప్ర‌మాదానికి గురైంది. ర‌న్‌వే నుంచి కిలోమీట‌ర్ వెళ్లిన త‌ర్వాత ఆ విమానం కూలిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఫోర్ట్ స్మిత్ నుంచి బయ‌లుదేరాల్సిన విమానాల‌ను ర‌ద్దు చేశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కెన‌డా ట్రాన్స్‌పోర్టు విభాగం దర్యాప్తు ప్రారంభించింది.


ఇటీవల వరుస విమాన ప్రమాదాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపాల కారణంగా కొన్ని, మాన తప్పిదాలు, వాతావరణంలో హఠాత్తుగా ఏర్పడే మార్పులు., ల్యాండిగ్ చేసే సమయంలో.. కొన్నిసార్లు పక్షులు ఢీ కొని ప్రమాదాలు జరగుతున్నాయని విమాన శాఖ అధికారులు చెబుతున్నారు. చాలా వరకు సాంకేతిక లోపాలను గమనించి పైలట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసారు దురదృష్టవశాత్తు గాల్లోనే ప్రాణాలు వదిలిన విషాద ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లో మొన్న మొరాకో రిజిస్టర్డ్ చిన్న విమానం ఈశాన్య పర్వత ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఐజ్వాల్ శివార్లలో మంగళవారం లెంగ్‌పుయి విమానాశ్రయంలో ఒక మయన్మార్ సైనిక విమానం కూలిపోయింది.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై డీసీజీఏ దర్యాప్తు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story