Pakistan : పాకిస్థాన్‌లో ఎదురుకాల్పులు

Pakistan : పాకిస్థాన్‌లో ఎదురుకాల్పులు

పొరుగు దేశం పాకిస్థాన్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో పాకిస్థాన్ సైనికులు ఎదురు కాల్పులు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు మిలటరీ మీడియా విభాగం తెలిపింది. పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు మిలిటరీ తెలిపింది. ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ (ఐబీఓ) సందర్భంగా భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులు జరిగాయి.

మరణించిన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ ప్రకటన పేర్కొంది. ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ అమాయక పౌరులను చంపే లక్ష్యంతో ఉన్నారని పాక్ మిలిటరీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ గాలింపు చేపట్టింది.

కాగా మంగళవారం పాక్ ప్రావిన్స్‌లోని ఒక పోలీసు స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక పోలీసుతో సహా కనీసం ఐదుగురు మరణించారు. ఇరాన్, అఫ్ఘానిస్థాన్‌ల సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్ ఉగ్రవాదులు, వేర్పాటువాద సంస్థల తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. 2022లో ప్రభుత్వంతో నిషేధిత తీవ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ కాల్పుల విరమణను ముగించినప్పటి నుంచి హింస పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story