అంతర్జాతీయం

యాంకరింగ్ చేస్తున్న ఆమె.. లైవ్‌లో మాజీ భర్త చేసిన పని..

7,82,000 మంది ఫాలోవర్లు, 63 లక్షల లైకులతో హ్యాపీగా బతికేస్తోంది. అదే అతడికి ఆమె పట్ల ఈర్ష్యకు కారణమైంది.

యాంకరింగ్ చేస్తున్న ఆమె.. లైవ్‌లో మాజీ భర్త చేసిన పని..
X

రోజూ గొడవలు పడుతు బతకడం కంటే విడిపోతే మంచిదనుకున్నారు. విడాకులు తీసుకుని ఎవరి జీవితాలు వాళ్లు గడుపుతున్నారు. అయినా అతడికి ఆమె మీద కోపం తగ్గలేదు. ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడు. సోషల్ మీడియాలో స్టార్ స్టేటస్‌ని సంపాదించుకుంది. 7,82,000 మంది ఫాలోవర్లు, 63 లక్షల లైకులతో హ్యాపీగా బతికేస్తోంది. అదే అతడికి ఆమె పట్ల ఈర్ష్యకు కారణమైంది. ప్రముఖ టిబెటన్ వీడియో బ్లాగర్ లూమూ లైవ్‌లో షో చేస్తుండగా ఆమె మాజీ భర్త వచ్చి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ప్రేక్షకుల కళ్లముందే ఆమె శరీరం మంటల్లో దహించుకుపోతోంది. లక్షలాది మంది అభిమానుల గుండెలను పిండేసిన ఈ ఘటన చైనాలోని అబాలో చోటు చేసుకుంది. విడాకులు తీసుకున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. లూమూ గత నెల 14న లైవ్‌లో షో చేస్తుండగా ఒక్కసారిగా స్క్రీన్‌పై పొగలు, పెద్దగా ఏడుస్తున్న శబ్ధాలు వినిపించినట్లు షో చూస్తున్న అభిమానులు తెలిపారు. 90 శాతం కాలిన గాయాలతో రెండు వారాలు లూమూ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు బుధవారం రాత్రి కన్నుమూసింది.

చికిత్స తీసుకుంటున్న సమయంలో సోదరి వైద్యానికి సహాయం చేయమంటూ అభిమానులను కోరగా మిలియన్ యువాన్లు విరాళం అందజేశారు. అయినప్పటికి లూమూ ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. 30 ఏళ్ల వయసున్న లూమూకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చైనాలోని గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే వీడియోలు చేసే లూమూ ఆయా ప్రాంత ప్రజలకు దగ్గరైంది. మరి కొన్ని వీడియోల్లో పాటలకు లిప్ మూమెంట్ ఇస్తూ టిక్‌టాక్‌లో సందడి చేసేది. అభిమానులు ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

Next Story

RELATED STORIES