South Africa: సౌత్ ఆఫ్రికాలో ఫోర్త్ వేవ్.. నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు..

South Africa: సౌత్ ఆఫ్రికాలో ఫోర్త్ వేవ్.. నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు..
South Africa: ఇండియాలో ఇప్పటకే కోవిడ్ రెండు వేవ్స్‌లో వచ్చి చాలామంది జీవితాలలో చీకటిని మిగిల్చి వెళ్లిపోయింది.

South Africa: ఇండియాలో ఇప్పటకే కోవిడ్ రెండు వేవ్స్‌లో వచ్చి చాలామంది జీవితాలలో చీకటిని మిగిల్చి వెళ్లిపోయింది. థర్డ్ వేవ్ వస్తుందా రాదా అని కొంతకాలం అందరూ భయపడినా.. తర్వాత అంతా సర్దుమనిగింది అనుకున్నారు కానీ.. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ మరోసారి అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా నుండి పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది. ఇండియాలోకి కూడా అడుగుపెట్టేసింది. కానీ అన్నింటితో పోలిస్తే.. సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉంది. అక్కడ ఇప్పటికే ఫోర్త్ వేవ్ కూడా మొదలయిపోయింది.

సౌత్ ఆఫ్రికా హెల్త్ మినిస్టర్ జో ఫాహ్లా చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పటికే ఆ దేశం కోవిడ్ ఫోర్త్ వేవ్‌లోకి అడుగుపెట్టిందట. దీనికి ముఖ్య కారణం ఇటీవల అక్కడ పుట్టిన ఒమ్రికాన్ వేరియంటే కారణమని ఆయన వెల్లడించారు. ఒమ్రికాన్ మరిన్ని మరణాలకు దారితీయకుండా ఉండాలంటే అక్కడి ప్రజలు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అలా అయితేనే క్రిస్మస్ సమయానికి లాక్‌డౌన్ లాంటివి ఏమీ అవసరం లేకుండా ప్రజలు తృప్తిగా ఉండవచ్చని అన్నారు.

ప్రభుత్వం కఠినమూన లాక్‌డౌన్‌ను అమలు చేయాలన్ని నిర్ణయం తీసుకోకముందే అందరు తమ దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్స్‌కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు. కోవిడ్ కేసులు సౌత్ ఆఫ్రికాలో విపరీతంగా పెరుగుతున్నాయని అక్కడి శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది కోవిడ్ బారిన పడి ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా నాలుగేళ్ల కంటే చిన్న వయసు ఉన్నవారు ఎక్కువగా ఈ ఒమ్రికాన్ వేరియంట్‌ వైరస్‌కు గురవుతున్నారని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story