South Korea: వెయ్యి శునకాలపై పైశాచికత్వం... మలమల మాడ్చి..

South Korea: వెయ్యి శునకాలపై పైశాచికత్వం... మలమల మాడ్చి..
దక్షిణ కొరియాలో వెయ్యి శునకాలను చంపిన కర్కోటకుడు; తిండి పెట్టకుండా మలమల మాడ్చిన పైశాచికత్వం; నివ్వేరపోతున్న జంతు ప్రేమికులు
సుమారు వెయ్యి శునకాలను ఆకలికి మాడ్చి అతి కిరాతకంగా చంపిన ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. ఈ మేరకు 60ఏళ్ల వ్యక్తిని కొరియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని సియోల్ కు 60కి.మీల దూరంలో ఉన్న గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కలతో పాటూ యజమానుల నిరాదరణకు గురైన శునకాలను తీసుకువచ్చి వాటిని ఇంటిలో బంధించి తిండీ, నీరు పెట్టకుండా మాడ్చి అవి కృంగి కృశించిపోయేవిధంగా చిత్ర హింసలకు గురి చేసేవాడని తెలుస్తోంది. స్థానికంగా నివాశముండే ఓ వ్యక్తి తన కుక్క కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. అనుమానస్పదంగా కనిపిస్తున్న వ్యక్తి ఇంటిపై దాడి చేయగా... ఇంట్లో వందల సంఖ్యలో శునకాల కళేబరాలు పోలీసుల తారసపడ్డాయి. బోనుల్లో శునకాలు కృంగి కృశించిపోయిన వైనం కళ్లకు కట్టాయి. కొన్ని కళేబరాలు బోనుల్లోనే ఉండిపోగా, మరి కొన్నింటిని గోనె సంచుల్లోనూ, ఇతర ప్లాస్టిక్ బ ్యాగుల్లోనూ కనుగొన్నారు. అయితే పెద్ద మొత్తంలో శునకాలు డాగ్ బ్రీడర్ల వద్ద నంచి వచ్చాయని తెలుస్తోంది. ఇక పిల్లలు కనలేని శునకాలను, చూసేందుకు అందంగా కనిపించని వాటిని ఇతడికి అప్పగించి చేతులు దులుపుకునేవారని తెలుస్తోంది. ఒక్కో శునకాన్ని తుదముట్టించేందుకు అతడికి పదివేల డాలర్లు ముట్టేవని అధికారులు వెల్లడించారు. బోనులో చిక్కుకున్న శునకాలు చనిపోయిన వాటి మాంసం తిని కొన్ని రోజులు నెట్టుకొచ్చినప్పటికీ అవి కూడా క్రమంగా కృశించి మరణించాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story