ప్లీజ్‌రా బాబు.. టీకాలు వేయించుకోండి

ప్లీజ్‌రా బాబు.. టీకాలు వేయించుకోండి
ఇప్పటికే కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రజలు ఈ వైరస్ బారిన పడితే తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయని ముందస్తు హెచ్చరికలు..

శీతాకాలం సమీపిస్తోంది.. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతాయి.. అసలే ఇప్పటికే కరోనాని కట్టడి చేసి అలసిపోయాం.. మళ్లీ ఇంకో వైరస్ వచ్చి మన ప్రాణాలు తీస్తే మరింత కష్టం.. ఇన్‌ఫ్లూయెంజా టీకాలు వేయించుకుంటే వైరస్ బారిన పడకుండా కొంత వరకు ప్రాణాలు కాపాడొచ్చు అని దక్షిణ కొరియా ప్రభుత్వం ఆ దేశ ప్రజలను కోరుతోంది. ఉచితంగా ఫ్లూ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన కొరియా.. ఇప్పటికే కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రజలు ఈ వైరస్ బారిన పడితే తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

కాగా, టీకా భద్రతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టీకా కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి సుమారు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే టీకాలకు, మరణాలకు ఏ మాత్రం సంబంధం లేదని అధికారులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దుష్ప్రభావాల కంటే టీకా వల్ల మంచే ఎక్కువగా జరుగుతుందని కొరియా ఆరోగ్య మంత్రి పార్క్ నీంగ్ హో వెల్లడించారు. తమ అభిప్రాయంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏకీభవిస్తోందని అన్నారు.

మరోవైపు టీకాలను సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోవడంతో 5మిలియన్ల డోసులను పారవేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కాగా, దేశంలో ప్రతి ఏటా సుమారు మూడు వేల మరణాలు సంభవిస్తుంటాయి. సీజనల్ వ్యాధుల కారణంగా మరింత మంది ప్రాణాలు కోల్పోకూడదని భావించిన ప్రభుత్వం టీకాలు వేయించుకోమంటూ ప్రజల్ని ప్రాధేయపడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story