స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌పై బ్రిక్స్ సదస్సులో ప్రస్తావించిన రష్యా అధ్యక్షుడు

స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌పై బ్రిక్స్ సదస్సులో ప్రస్తావించిన రష్యా అధ్యక్షుడు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకొస్తున్న వ్యాక్సిన్లు వివిధ ట్రయల్ దశల్లో ఉన్నాయి. అయితే రష్యా తయారుచేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ ఉత్పత్తి భారత్, చైనా దేశాల్లో జరుగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ సమయంలో కరోనా వైరస్ ఎదుర్కొనే టీకా అభివృద్ది కోసం బ్రిక్స్ దేశాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయన్నారు. ముందుగా నిర్ధేశించుకున్న విధంగా బ్రిక్స్ దేశాల టీకాల పరిశోధనాభివృద్ది కేంద్రం ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ దేశాల సదస్సులో పుతిన్ మాట్లాడారు.

రష్యా తయారుచేసిన స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం బ్రెజిల్‌, భారత్ తోపాటు రష్యాకు చెందిన వారు కూడా ఆర్ డిఐఎఫ్‌ ఒప్పందం చేకుంది. అయితే ఈ వ్యాక్సిన్ ఉత్తత్పిపై భారత్, చైనాలోని ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా దేశాల అవసరాలకే కాకుండా.. ఇతర దేశాలకు సరఫరా కూడా చేయొచ్చు. ప్రస్తుతం రష్యా వ్యాక్సిన్‌ కూడా దాదాపు 92శాతం సమర్థతను కలిగిఉన్నట్లు మధ్యంతర ఫలితాల్లో వెల్లడైన విషయాన్ని తాజాగా రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక భారత్‌లోనూ స్పుత్నిక్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story