Sri Lanka : ఆహార సంక్షోభంలో శ్రీలంక.. కోడిగుడ్డు రూ. 35, కిలో చికెన్ రూ. 1000
Sri Lanka : తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Sri Lanka : తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు 35 రూపాయలు పలుకుతుండగా, కిలో చికెన్ వెయ్యికి పైమాటే. ఇక పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలైతే అందకుండా పోయాయి. లీటరు పెట్రోలు ప్రస్తుతం 283 రూపాయలు ఉంది. డీజిల్ 220 రూపాయలుగా ఉంది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు పడిపోయింది. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. దేశంలో ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
1990 సంక్షోభాన్ని మించి ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. పెరిగిన ధరలతో ఆహార పదార్థాలను కొనలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడపుడే బయటపడే పరిస్థితిలో లేదు. దేశంలో ద్రవ్యోల్భణం ఊహించని స్థాయిలో పెరిగిపోగా.. ఆ భారం ప్రజలపై పడింది. చైనా నుంచి శ్రీలంక తెచ్చుకున్న ఆర్ధిక సహాయాలే ఈ దుస్థితికి కారణమంటున్నారు నిపుణులు. ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు. పరిస్థితి అర్ధం చేసుకున్న భారత ప్రభుత్వం ఇటీవల బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ను అందించింది.
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT