Srilanka: 200మంది స్మగ్లర్ల అరెస్ట్‌

Srilanka: 200మంది స్మగ్లర్ల అరెస్ట్‌
పోలీసులు, ఏయిర్‌ఫోర్స్‌, స్పెషల్‌ కమాండోస్‌ కలిసి స్పెషల్‌ ఆపరేషన్‌

శ్రీలంకలో ఓకేసారి 200మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. పోలీసులు, ఏయిర్‌ఫోర్స్‌, స్పెషల్‌ కమాండోస్‌ ప్రత్యేకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ పోలీసు అధికార ప్రతినిధి నిహాల్‌ తాల్దువా తెలిపారు. ఈ ఆపరేషన్‌ దేశంలోని వెస్టెర్న్‌, సౌతెర్న్‌ పార్ట్స్‌లో జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో 285 మంది నార్కోటిక్స్‌ సరఫరా చేసే అనుమానితులని పోలీసులు అరెస్టు చేశారని ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి గంజాయి, హెరాయిన్‌ లాంటి పదర్ధాలను సీజ్‌ చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే నేవీ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో నార్తెన్‌ జఫ్నా ద్వీపకల్పంలో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు. సముద్ర మార్గం నుంచి నార్కోటిక్స్‌ స్మగ్‌లింగ్‌ను లంకలోనికి రాకుండా గట్టి నిఘాను ఉంచామని ఆదివారం ఓ ప్రకటనలో నేవీ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story