Dream University : డ్రీమ్ యూనివర్శిటీలో చదువుకోవాలని 4వేల కి.మీ. సైకిల్ తొక్కాడు

Dream University : డ్రీమ్ యూనివర్శిటీలో చదువుకోవాలని 4వేల కి.మీ. సైకిల్ తొక్కాడు
4వేల కి.మీ. సైకిల్ తొక్కి కన్నకలను సాకారం చేసుకున్న విద్యార్థి

ఆఫ్రికాలోని గినియాకు చెందిన ఒక విద్యార్థి తన కలల విశ్వవిద్యాలయం అల్-అజార్ అల్-షరీఫ్, సున్నీ ఇస్లామిక్ లెర్నింగ్ కోసం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి దాదాపు 4,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. 25 ఏళ్ల మమదౌ సఫాయు బారీ నాలుగు నెలల వ్యవధిలో నాలుగు దేశాలు పర్యటించాడు ఈ క్రమంలో ఈ దేశాల్లోని కఠినమైన వాతావరణ పరిస్థితులు, రాజకీయ గందరగోళాన్ని ఎదుర్కొన్నాడు. అతను కైరో చేరుకున్నప్పుడు అతనికి పూర్తి స్కాలర్‌షిప్ అందించబడింది.

అల్-అజార్‌లోని ఇస్లామిక్ స్టడీస్ కోర్సుకు, దేశానికి వెళ్లే విమాన టిక్కెట్‌లకు అయ్యే భారాన్ని తాను భరించలేకపోతున్నానని అతను బీబీసీతో చెప్పాడు. అయినప్పటికీ, ఇన్స్టిట్యూట్ ఖ్యాతి అతనిని మాలి, బుర్కినా ఫాసో, టోగో, బెనిన్, నైజర్, చాద్ ద్వారా కఠినమైన మార్గాన్ని చేపట్టేలా చేసింది. తన అనుభవాన్ని పంచుకుంటూ, మాలి, బుర్కినా ఫాసో, నైజర్‌లలో ఇస్లామిక్ మిలిటెంట్లు పౌరులపై జరిపిన దాడులను తాను చూశానని, ఇది దేశంలో తిరుగుబాట్లు, రాజకీయ అస్థిరతకు దారితీసిందని అన్నాడు. "ఈ దేశాలలో ప్రయాణించడం చాలా కష్టం, ఎందుకంటే వారికి ఈ సమయంలో భద్రత లేదు. వారికి చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడి ప్రజలు చాలా భయపడుతున్నారు. మాలి, బుర్కినా ఫాసోలో ప్రజలు నన్ను చెడ్డ వ్యక్తిగా చూస్తున్నారు. పైగా నేను వారి వద్ద సైన్యం, పెద్ద తుపాకులు, కార్లతో ఉండడం చూశాను" అని బారీ చెప్పాడు. తనను ఏ కారణం లేకుండానే అరెస్టు చేశారని అని కూడా పేర్కొన్నాడు. ఈ సంఘటనలు బుర్కినా ఫాసో, టోగోలో జరిగాయి.

చాద్‌లో, ఒక జర్నలిస్ట్‌తో ఇంటర్వ్యూ తర్వాత అతని కథ వైరల్‌గా మారింది. దీంతో అతనికి మద్దతు ఇవ్వడానికి చాలా మంది ముందుకు వచ్చారు. చివరికి అతను ఈజిప్ట్‌కు విమానంలో వెళ్లడానికి, యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్‌ను నివారించడానికి అనుమతి పొందాడు. సెప్టెంబరు 5న అతను కైరో చేరుకున్నప్పుడు, అల్-అజార్ అల్-షరీఫ్‌లోని ఇస్లామిక్ స్టడీస్ డీన్, డాక్టర్ నహ్లా ఎల్సీడీ అతనిని కలుసుకుని, వారి ఇస్లామిక్ స్టడీస్ కోర్సులో సీటు ఇచ్చింది. తనకు పూర్తి స్కాలర్‌షిప్ కూడా లభించిందని తెలుసుకున్న తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని బారీ తెలిపాడు. "నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాను" అని అతను వ్యాఖ్యానించాడు.

Tags

Read MoreRead Less
Next Story