Super moon : కనువిందు చేసిన సూపర్ మూన్

Super moon :  కనువిందు చేసిన సూపర్ మూన్
ఈనెల 30న ఆకట్టుకొనున్న బ్లూ మూన్‌

లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా ఆసియా దేశాల్లో గత రాత్రి కనిపించిన సూపర్‌ మూన్ కనువిందు చేసింది. సాధారణ రోజుల్లో కంటే భూమికి దగ్గరగా చంద్రుడు రావడం వల్ల జాబిలి పెద్ద ఆకారంలో మరింత కాతివంతంగా కనిపిస్తుంది. ఈ సంఘటను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేర్లతో పిలుస్తుంటారు.

బ్రెజిల్‌లోని రియో డి జనైరోలో, చిలీ రాజధాని శాంటియాగోలోనూ, అతిపెద్ద చంద్రుడు కనువిందు చేశాడు. బోస్నియాలో మేఘాలు కమ్ముకున్నప్పటికీ ఫుల్ మూన్. కనిపించింది. ప్రజలు ఎంతో ఆసక్తిగా అతిపెద్ద జాబిలిని తిలకించారు. గ్రీస్‌లోనూ సూపర్ మూన్‌ ఆకట్టుకుంది. ఏథెన్స్ సమీపంలోని పురాతన ఆలయం పొసిడాన్‌ దగ్గర అతిపెద్ద జాబిలి అలరించింది. దక్షిణాఫ్రికాలోనూ ఫుల్‌మూన్‌ దర్శనం ఇచ్చింది.


ఆగస్టు నెలలో రెండు సూపర్‌మూన్‌లు కనిపించనుండగా ఇది మొదటిది. వచ్చే 30న కూడా చంద్రుడు అతిపెద్దగా దర్శనం ఇవ్వనున్నాడు. ఆగస్టు 30న కనిపించే చంద్రుడిని బ్లూమూన్‌గా పిలుస్తారు. 2018లో ఒకసారి సూపర్‌ మూన్ ఒకే నెలలో రెండుసార్లు కనిపించింది. మళ్లీ 2037లో కానీ ఇలా కనిపించే అవకాశంలేదని భౌగోళిక పరిశోధకులు చెబుతున్నారు.


సాధారణంగా చంద్రుడు భూమికి 222,159 మైళ్లు అంటే 357,530 కిలోమీటర్లు దూరంలో ఉంటాడు. సూపర్ మూన్ వచ్చే రోజుల్లో ఈ దూరం తగ్గుతుంది. భూమికి అత్యంత సమీపంగా రావడంతో చంద్రుడు 12.8% అధికంగా ప్రకాశవంతంగానూ,సాధారణం కన్నా 5.8% పెద్దగా కనిపిస్తాడు.


సూపర్ మూన్ అనే పేరును రిచర్డ్ నాలీ అనే అంతరిక్ష పరిశోధకుడు 1979 లో పెట్టారు. ఇక USAలో ఉన్న అల్గోన్‌క్విన్ తెగలు స్టర్జన్ మూన్ అని పిలుస్తారు. ఇలా జరిగినప్పుడు పెద్ద చెరువులు, నీటి వనరులలో ఏడాది అంతా పెద్ద చేపలు దొరుకుతాయని వారు విశ్వసిస్తారు. ఈ సూపర్‌మూన్‌కు రెడ్ మూన్, కార్న్ , గ్రీన్ కార్న్ మూన్, బార్లీ మూన్, హెర్బ్ మూన్, గ్రెయిన్ మూన్ డాగ్ మూన్ అనే పేర్లు కూడా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story