క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేశాడు.. రూ.25లక్షలు ఫైన్ వేశారు!

క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేశాడు.. రూ.25లక్షలు ఫైన్ వేశారు!
కఠినమైన క్వారంటైన్ నిబంధనలను 7 సార్లు ఉల్లఘించినందుకు ఓ వ్యక్తికి రూ. 25,52,098 ఫైన్ వేశారు అధికారులు. ఈ ఘటన చైనా లోని తైవాన్‌లో జరిగింది.

కఠినమైన క్వారంటైన్ నిబంధనలను 7 సార్లు ఉల్లఘించినందుకు ఓ వ్యక్తికి రూ. 25,52,098 ఫైన్ వేశారు అధికారులు. ఈ ఘటన చైనా లోని తైవాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ తైవాన్లోని తైచుంగ్లో నివసిస్తున్న ఓ వ్యాపారి పని మీద కొద్దిరోజుల క్రితం చైనాకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక అతడిని ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచారు అధికారులు. అయితే క్వారంటైన్‌లో ఉన్న 3 రోజులలోనే అతగాడు ఏకంగా 7 సార్లు నిబంధనలను ఉల్లంఘించి బయటకి వెళ్లాడు. దీనితో స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు అతనికి భారీ జరిమానాతో షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story