నిమిషానికో అరాచకం.. టైట్‌ డ్రెస్సులు వేసుకున్నందుకు మహిళను కాల్చి చంపేసిన తాలిబన్లు ..!

నిమిషానికో అరాచకం.. టైట్‌ డ్రెస్సులు వేసుకున్నందుకు మహిళను కాల్చి చంపేసిన తాలిబన్లు ..!
ఆఫ్గాన్‌లో తాలిబన్లు నిమిషానికో అరాచకం సృష్టిస్తున్నారు. మహిళల పరిస్థితైతే దారుణంగా ఉంది. టైట్‌ డ్రెస్సులు వేసుకున్నందుకు ఓ మహిళను కాల్చి చంపారు.

ఆఫ్గాన్‌లో తాలిబన్లు నిమిషానికో అరాచకం సృష్టిస్తున్నారు. మహిళల పరిస్థితైతే దారుణంగా ఉంది. టైట్‌ డ్రెస్సులు వేసుకున్నందుకు ఓ మహిళను కాల్చి చంపారు. చివరికి నెయిల్ పాలిష్‌ వేసుకున్నట్లు కనిపించినా వదలడం లేదు. గోళ్ల రంగు వేసుకుంటే వేళ్లు నరికేస్తున్నారు. ఆఫ్గాన్‌లోని టఖర్ ప్రావిన్స్‌లో బురఖా ధరించనందుకు ఓ మహిళను కాల్చి చంపారు. కాబూల్‌లో హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులపై కాల్పులు జరిపారు. కాబూల్ ఎయిర్‌పోర్టులో మహిళలు, చిన్నారులను కొరడాలతో కొట్టారు. ఈ తొక్కిసలాటలో నలుగురు మహిళలు చనిపోయారు. 12 ఏళ్లు నిండిన ఆడపిల్లలను ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

రోడ్లపై స్నేహితులతో కలిసి వెళ్తున్నా సరే.. చితకబాదుతున్నారు. ఆడపిల్లలు ఇలా రోడ్లపై నడవడం ఇస్లామును అగౌరవపరిచినట్టేనంటున్నారు తాలిబన్లు. మొన్నామధ్య వంట సరిగా చేయలేదని ఓ మహిళను సజీవదహనం చేశారు. చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదు. టీ-షర్టులు, జీన్స్ వేసుకున్నందుకు చావగొట్టారు తాలిబన్లు. జర్నలిస్టులు కూడా ఆఫ్ఘన్ దుస్తులే వేసుకోవాలని హుకుం జారీ చేశారు. చివరికి పురుష జర్నలిస్టులకు సైతం తాలిబన్లు డ్రెస్‌కోడ్ పెట్టబోతున్నారు.

ఆఫ్గాన్‌ తమ చేతికొచ్చిందన్న అహంకారంతో అమెరికాకే వార్నింగ్‌ ఇచ్చే స్థాయికి ఎదిగారు తాలిబన్లు. ఈ నెల 31 తరువాత అమెరికన్ సైనికులు కనిపించకూడదని ఆల్టిమేట్టం జారీ చేశారు. ఈ 31వ తేదీ వరకు ఆఫ్గాన్‌ నుంచి వెళ్లిపోతామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అయితే, తాలిబన్ల అరాచకాలను గమనిస్తున్న అమెరికా.. బలగాల ఉపసంహరణ గడువు తేదీని మరింత పెంచే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఒకవేళ అమెరికా గనక గడువు పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story