పాత స్వెట్టర్స్‌తో పనికొచ్చే మిటెన్స్.. ఒక్క రోజులో సెలబ్రెటీ అయిన స్కూల్ టీచర్

పాత స్వెట్టర్స్‌తో పనికొచ్చే మిటెన్స్.. ఒక్క రోజులో సెలబ్రెటీ అయిన స్కూల్ టీచర్
రోనా సీజన్‌లో ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ క్లాసులు చెబుతూ బిజీగా ఉంటూనే జెన్నిఫర్‌కు ఖాళీ సమయంలో మిటెన్స్ తయారుచేసేవారు.

అప్పటి వరకు ఆమె ఓ స్కూల్ టీచర్.. ఖాళీ టైమ్‌లో వాడని స్వెట్టర్స్ సేకరించడం వాటితో మిటెన్స్ (చేతులకు వేసుకునేవి) తయారు చేయడం.. మరి ఆ మిటెన్స్ మామూలు వ్యక్తులు వేసుకుంటే వార్తేముంది.. అమెరికన్ సెనెటర్ వేసుకోవడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఎవరు తయారు చేశారంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఆయన వేసుకున్న మిటెన్స్ తయారు చేసింది అమెరికాలోని వెర్మాంట్ టౌన్, ఎసెక్స్ జంక్షన్‌ పాఠశాలలో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ జెన్నిఫర్ ఎలీస్. జనవరి 20, 2021 బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సెనెటర్ బెర్నీ మిటెన్స్ వేసుకున్నారు. వాస్తవానికి అవి చేతులకు వెచ్చదనం కలిగిస్తాయి.

వాటిని జెన్నిఫర్ వ్యర్ధాలతో తయారు చేశారు. పనిరాని ప్లాస్టిక్ సీసాలతో మిటెన్స్ లోపలి పొరను తయారు చేశారు. పాడైపోయిన స్వెటర్లను కట్ చేసి, రంగు రంగుల కాంబినేషన్‌తో తయారు చేశారు. కరోనా సీజన్‌లో ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ క్లాసులు చెబుతూ బిజీగా ఉంటూనే జెన్నిఫర్‌కు ఖాళీ సమయంలో మిటెన్స్ తయారుచేసేవారు.

వాస్తవానికి ఈ మిటెన్స్ నాలుగేళ్ల క్రితమే స్నేహితురాలితో కలిసి తయారు చేయడం ప్రారంభించారు. పాత ఉన్న స్వెట్టర్లను కట్ చేసి తన తల్లి ఇచ్చిన కుట్టు మిషన్ మీద మిటెన్స్ కుడుతుండేవారు. ఒక్కో జత కుట్టడానికి గంట సమయం పట్టేది. పాప పుట్టిన తరువాత కుట్టడానికి సమయం లేక ఆపేశారు. ఎవరికైనా బహుమతి ఇవ్వాలంటే సెలవు రోజుల్లో కుట్టేవారు జెన్నిఫర్.

ఇక ఇప్పుడు సెనెటర్ బెర్నీ వేసుకోవడంతో వాటికి డిమాండ్ పెరిగింది. జెన్నిఫర్‌కు మిటెన్స్ కావాలంటూ ఆర్డర్లు వెల్లువెత్తాయి. అయితే జెన్నిఫర్‌కి వ్యాపారం చేసే ఆలోచన లేదు. అలా చేస్తే మిటెన్స్‌కి దక్కిన గౌరవం పోతుందని అంటారు. అయినా వ్యాపారంలో పడి బిజీ అయిపోతే కుటుంబాన్ని చూసుకోవడానికి సమయం ఉండదని చెబుతారు.

నా కూతురు బెర్నీ కోడలు నడుపుతున్న ప్రీస్కూల్లో చదువుతోంది. 2016లో ఆయనకు బహుమతిగా మిటెన్స్ పంపించాను. వాటిని ఆయన భద్రపరుచుకుని నాలుగేళ్ల తరువాత కూడా వాటిని ధరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన యాక్ససరీస్‌ని ధరిస్తారు. కానీ బెర్నీ నేను ఇచ్చిన మిటెన్స్ వేసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story