ప్రధానికి కోపం వచ్చింది.. విలేకరుల మీదకి శానిటైజర్ స్ప్రే చేసి..

ప్రధానికి కోపం వచ్చింది.. విలేకరుల మీదకి శానిటైజర్ స్ప్రే చేసి..
అంతటితో ఊరుకోకుండా ముఖానికి ఉన్న మాస్కుని సవరించుకుంటూ చేతిలో ఉన్న శానిటైజర్‌తో విలేకురుల మీద స్ప్రే చేసుకుంటూ వెళ్లారు.

ఏంటా పిచ్చి ప్రశ్నలు.. ఎక్‌స్ట్రా మాట్లాడుతున్నారు.. ఎంత విలేఖరులైతే మాత్రం.. దేశానికి ప్రధానిని అయినంత మాత్రాన మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్తాననుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోకుండా ముఖానికి ఉన్న మాస్కుని సవరించుకుంటూ చేతిలో ఉన్న శానిటైజర్‌తో విలేకురుల మీద స్ప్రే చేసుకుంటూ వెళ్లారు.

ఇలాంటి సంఘటనలు థాయ్‌లాండ్ ప్రధానికి కొత్తేం కాదు. ఇది వరకు కూడా ఇలాంటి తిక్క పనులే చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు ఈయన చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏడేళ్ల క్రితం జరిగిన నిరసనల్లో ప్రధాని ప్రయూత్ ఇలాఖాలో పని చేసిన ముగ్గురు మంత్రులు తిరుగుబాటు చేశారు. వారికి గత వారం జైలు శిక్ష పడింది. ఖాళీగా ఉన్న ఆ స్థానాల్లో ఎవరిని భర్తీ చేస్తున్నారు.. మీ పరిశీలనలో ఉన్న నేతల జాబితాను తెలియజేయమని మీడియా ప్రతినిధులు ప్రధానిని కోరారు. దాంతో ప్రధానికి తిక్కరేగింది. విలేకరుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మీ పని మీరు చూసుకోండి అన్నారు.

అటుపై విలేకరులు కూర్చున్న చోటుకి వచ్చి.. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా.. దాని గురించి నాకు ఏమీ తెలియదు.. అయినా ప్రధానికి ముందుగా అవన్నీ తెలియాలని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఆ తర్వాత పోడియంను వదిలి వెళ్తూ.. చేతిలో ఉన్న శానిటైజర్‌ను విలేకరులపైకి స్ప్రే చేసుకుంటూ వెళ్లిపోయారు.

ఇప్పటికే ప్రయూత్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందనే ఆరోపణలను ఎదుర్కుంటోంది. కోవిడ్ వ్యాక్పిన్ ప్రక్రియలో లోపాలు, అవినీతిని ప్రోత్సహించడం, మానవ హక్కులను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలతో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రిందట పార్లమెంటులో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి ప్రయూత్ గట్టెక్కారు.

ప్రధాని హోదాలో ఉండి తన స్థాయికి తగ్గ పనులు చేయకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రయూత్ గతంలోనూ ఓ విలేకరి చెవిని మెలితిప్పారు.. మరోసారి కెమెరా మెన్‌పై అరటి పండు తొక్కను విసిరేశారు. 2018లో ఓ సారి ఓ కార్యక్రమానికి వచ్చి విలేకరులతో మాట్లాడేది లేదంటూ మూతి బిగించుకున్నారు. వేదికపై ఏర్పాటు చేసిన తన కటౌట్‌ని చూపిస్తూ.. అతడిని ప్రశ్నించండి అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story