Bird Flu: అంటార్కిటికాలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు..

Bird Flu: అంటార్కిటికాలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు..
పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తల ఆందోళన

అంటార్కిటికా ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్‌ ను ఈ నెల 24న గుర్తించారు. మృతిచెందిన రెండు స్కువా పక్షుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ ఉనికిని గుర్తించారు. అంటార్కిటికాలో ఉండే వేలాది పెంగ్విన్‌ లకు ఈ వ్యాధి ప్రబలే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మృతిచెందిన రెండు స్కువా పక్షుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ ఉనికిని గుర్తించారు. అంటార్కిటికాలో ఉండే వేలాది పెంగ్విన్‌లకు ఈ వ్యాధి ప్రబలే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మనుషులకు వ్యాప్తి చెందకుండా సీఐఎస్‌సీ పరిశోధకులు చర్యలు చేపడుతున్నారు. పక్షుల్లో ప్రాణాంతకమైన హెచ్‌5ఎన్‌1 రకాన్ని 1997లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

హెచ్5ఎన్1 వంటి ఏవీయన్ ఇన్‌ఫ్లూయేంజా వైరస్ కొన్ని పక్షులకు సోకుతుంది. దీన్నే బర్డ్ ఫ్లూ అంటారు. ఆ పక్షులకు దగ్గరగా మిగతా పక్షులు వెళ్తే వాటికి కూడా ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ కారణంగా కోళ్లు, పక్షులు త్వరగా మరణిస్తాయి. వాటి మృతదేహాల దగ్గరకు ఇతర పక్షులు వెళ్లినా కూడా ఈ వైరస్ సంక్రమించడం చాలా సులువు. అలాగే పక్షి కళ్ళు, నోటి నుంచి వచ్చే ద్రవాలు, అలాగే పక్షుల రెట్టల ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ. బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన తరువాత పక్షుల్లో పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీనివల్లే బర్డ్ ఫ్లూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్కువగా వలస పక్షులే ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా మనుషులు మరణించే శాతం మాత్రం చాలా తక్కువ. అలాగే ఈ బర్డ్ ఫ్లూ సోకిన మనుషుల నుంచి ఇతర మనుషులకు అది వ్యాపించదు. అయితే ఈ వైరస్ కరోనా లాగే మ్యుటేషన్ చెంది బలంగా మారి మనుషుల్లో కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సాధిస్తే మాత్రం మానవాళి ప్రమాదంలో పడినట్టే. ప్రస్తుతానికైతే బర్డ్ ఫ్లూ మనుషులను ఏమీ చేయలేకపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story