ఆ అడవిలోకి వెళితే ఆత్మహత్యే!

ఆ అడవిలోకి వెళితే ఆత్మహత్యే!
* జపాన్‌లోని అవుకిగహారా అడవిలో సూసైడ్స్ మిస్టరీ * చీకటి పడితే చాలు పారానార్మల్ యాక్టివిస్టులు ఆత్మల వేట సాగిస్తారు

* ఇసుక వేస్తే రాలనంత దట్టమైన ఆ అడవిలో పట్టపగలే చీకట్లు కమ్ముకుంటాయి

* అడుగుల చప్పుడు, పక్షుల అరుపులు తప్ప ఇంకేమీ వినిపించవు

* చెట్లపై వేలాడే శవాలు... చిందరవందరగా పడివుండే వస్తువులే అడుగడుగునా కనిపిస్తాయి

* చీకటి పడితే చాలు పారానార్మల్ యాక్టివిస్టులు ఆత్మల వేట సాగిస్తారు

* జపాన్‌లోని అవుకిగహారా అడవిలో సూసైడ్స్ మిస్టరీ

జపాన్‌లోని అవుకిగహారా అడవిలో ప్రతినిత్యం కనిపించే భయానక దృశ్యాలివి. పేద్ద కొండ... దానిపై ఎత్తైన చెట్లు. ఆ కొండపై అడుగడుగునా ప్రమాదాలు పొంచివుంటాయి. అయినాసరే ఏటా వందల మంది ఈ అడవి బాటపడతారు. ఒక్క జపాన్‌ వాసులే కాదు... ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఈ అడవికి వస్తుంటారు. అలాగని ఇదేమీ టూరిస్ట్ స్పాట్ కాదు. డెత్ స్పాట్. అవును... మీరు విన్నది నిజమే. జనం ఇక్కడికి చావడానికే వస్తారు. ఈ ఎత్తైన చెట్లకు ఉరివేసుకుని ఉసురుతీసుకుంటారు. అందుకే ఈ అడవికి సూసైడ్ ఫారెస్ట్ అనే పేరు వచ్చింది. దీనికి సీ ఆఫ్ ట్రీస్ అనే మరో పేరు కూడా ఉంది

జపాన్ రాజధాని టోక్యో నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండు గంటలపాటు ప్రయాణించి ఈ వనానికి చేరుకుంటారు. ఇంతటి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకునేది ప్రాణాలు తీసుకోడానికే అంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ఈ అడవిలో ఎక్కడ చూసినా చెట్లకు ఉరితాళ్లు వేలాడుతుంటాయి. కొన్నిటికి శవాలు ఉంటే.... మరికొన్నిటి నుంచి శవాలు కుళ్లిపోయి కిందపడిపోతాయి. మరికొన్ని డెడ్ బాడీలను నక్కలు, ఇతర అడవి జంతువులు పీక్కుతుంటాయి. అందుకే ఈ ప్రాంతమంతా ఎంతో భయానకంగా ఉంటుంది. పుర్రెలు, అస్థిపంజరాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటాయి

35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అవుకిగహారా అడవి... పచ్చని చెట్లతో ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం శవాల గుట్టలు భయపెడుతుంటాయి. 1950 నుంచే ఇక్కడ ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. 1980లో 30 మంది ఈ అడవికి వచ్చి సూసైడ్ చేసుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఆ తర్వాతి ఏడాది నుంచి ఆత్మహత్యలు డబుల్ అవుతూ వస్తున్నాయి. 2014లో జపాన్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా 25 వేల మందికిపైగా సూసైడ్ చేసుకుంటే... అందులో కొన్ని వందల మంది అవుకిగహారా ఫారెస్ట్‌లోనే బలవన్మరణాలకు పాల్పడ్డారు. పోలీసులు, వాలంటీర్లు ఈ అడవిలో శవాల కోసం గాలిస్తుంటారు. దొరికిన వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అడ్రస్ దొరకకపోతే అక్కడే అంత్యక్రియలు చేసేస్తుంటారు. ఇలా 2002లో 78 శవాలు, 2003లో 105 డెడ్ బాడీలు దొరికాయి. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఆ తర్వాత నుంచి ఏటా ఎంతమంది చనిపోతున్నారనే లెక్కలను అధికారులు వెల్లడించడం లేదు. అలాగని ఆత్మహత్యలు ఆగలేదు. ఏటికేడు రెట్టింపవుతూనే ఉన్నాయి

అవుకిగహారా అడవికే వచ్చి ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకుంటారు. ఇదే కదా మీ డౌట్. జపాన్ పురాణాలు దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే అదో మూఢనమ్మకం అనే వాదనా ఉంది. ఈ అడవిలో ఉండే చెట్లకు ఉరితాళ్లు బిగించి ఆత్మహత్య చేసుకుంటే మరణించిన తర్వాత అతీత శక్తులు ఆవహిస్తాయట. అసలు ప్రాణమే లేకుంటే ఇక శక్తులు ఎక్కడివి? అయినాసరే ఇదేమీ పట్టించుకోరు. గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. మరికొంతమంది అత్యధిక మోతాదులో డ్రగ్స్ తీసుకుని తనువు చాలిస్తుంటారు. ఆత్మహత్యలకు మరో కారణం... ఎక్కడో చచ్చేకంటే ఈ అడవిలో స్వేచ్ఛగా చనిపోవచ్చనేది మరికొందరి భావన. ఎందుకంటే సెల్‌ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ తెలుసుకునే వీలుంది. కానీ ఈ అడవిలో అసలు సెల్‌ఫోన్ సిగ్నల్సే రావు. అందుకే ఎవరైనా సూసైడ్ చేసుకున్నాసరే సిగ్నల్స్ ఆధారంగా గుర్తించే అవకాశం ఉండదు

ఇక వందల మంది ఈ ఫారెస్ట్‌లో ప్రాణాలు తీసుకుంటుండడంతో మోస్ట్ హాంటెడ్‌ ప్లేస్‌గా మారింది. దీనికి దెయ్యాల నివాసం అనే పేరు కూడా వచ్చింది. అందుకే పారానార్మల్ యాక్టివిస్టులు ఈ అడవిలో రాత్రివేళ దెయ్యాల వేట సాగిస్తుంటారు. ఆత్మల కోసం అన్వేషిస్తుంటారు. వాటితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అడవిలో వింత శబ్ధాలను రికార్డు చేసి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేస్తుంటారు. మరి నిజంగా దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాత్మలు ఉన్నాయా లేవా అంటే మాత్రం ఎవరికి తోచిన సమాధానం వాళ్లు చెప్తుంటారు

అడవిలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. అడవిలోకి ఎవరూ వెళ్లడానికి వీల్లేదని నిషేధాజ్ఞలు విధించింది. బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దంటూ బోర్డులు పెట్టించింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ పెంచింది. అయినాసరే సూసైడ్స్ మాత్రం ఆగడం లేదు. వీటిని ఎలా అడ్డుకోవాలో అర్థంగాక ప్రభుత్వం తలపట్టుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story