WHO: కూల్ డ్రింక్ లు ప్రాంణాంతకం!

WHO: కూల్ డ్రింక్ లు ప్రాంణాంతకం!
కృత్రిమ స్వీటనర్స్' పై 'ప్రపంచ ఆహార సంస్థ' నూతన గైడ్ లైన్స్



'కృత్రిమ స్వీటనర్స్' పై 'ప్రపంచ ఆహార సంస్థ' నూతన గైడ్ లైన్స్ విడుదల చేసింది. 'కృత్రిమ స్వీటెనర్స్ 'కు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉంది. అలాంటి వాటిలో ఒకటైన అస్పర్తమే (Aspartame) లో క్యాన్సర్ కారకాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) వెల్లడించింది. నాన్-షుగర్ స్వీటెనర్లు ( ఎన్‌.ఎస్‌.ఎస్) అని పిలవబడే వీటిని ఉపయోగించకుండా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కార్బోనేటేడ్ శీతల పానీయాలలో ఈ కృత్రిమ స్వీటెనర్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. వాషింగ్టన్ పోస్ట్‌ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యంత సాధారణ కృత్రిమ స్వీటెనర్‌లలో ఒకటైన Aspartame, దీని పైన US లో చేసిన పరిశోధనలో క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందన్న సంగతి బయటపడింది. కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన ఒక నెల తరవాత ఈ నియమం వర్తిస్తుందని, ప్రముఖ వార్తా ఏజెన్సీ 'రాయిటర్స్ ' ప్రకటనలో ఈ వాస్తవాలని ప్రజలకు తెలపడానికి WHO యొక్క 'క్యాన్సర్ పరిశోధనా సంస్థ' సిద్ధంగా ఉందని, తెలిపింది.


US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 1981లో ఈ 'అస్పర్టమ్‌' ను ఆమోదించిందని, ఆ తరవాత దాని భద్రతను ఐదుసార్లు సమీక్షించిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక లో పేర్కొంది. భారతదేశంతో సహా 90కి పైగా దేశాలు దీని వినియోగాన్ని ఆమోదించాయి. అస్పర్టమేలో కేలరీలు ఉండవు. కానీ, ఇది టేబుల్ షుగర్ కంటే దాదాపు 200 రెట్లు తియ్యగా ఉంటుంది. 2009 భారతదేశ ఆహార భద్రత మరియు నియంత్రణ సంస్థ( FSSAI ) ఈ కృత్రిమ స్వీట్నర్ ను ఆహార ఉత్పత్తికి అనుగుణంగా ఉందని సిఫార్సు చేయడం జరిగింది. దాదాపు 95 శాతం కార్బోనేటేడ్ శీతల పానీయాలలో ఈ 'అస్పర్టమ్ ' అనే కృత్రిమ స్వీటెనర్‌ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ కృత్రిమ స్వీటెనర్‌లో ఉండే రసాయనం వలన డిఎన్ఏ కూడా దెబ్బ తింటుందని పరిశోధనలలో వెల్లడైంది.

Tags

Read MoreRead Less
Next Story