నాన్నా.. నేను పడను.. ఎందుకు భయం: వీడియో వైరల్

అమ్మ.. అన్నం తినని మారాం చేస్తున్న తన చిన్నారిని ఒడిలో కూర్చొబెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తూ ప్రేమని పంచితే.. నాన్న నలుగురిలో ఎలా బతకాలి.. స్ట్రాంగ్‌గా ఎలా తయారు కావాలో నేర్పుతున్నారు. తన కూతురిని ఓ మంచి జిమ్నాస్టర్‌ని చేయాలని కలలు కంటున్నారు. పుట్టినప్పటినుంచే ఆ చిన్నారికి ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారు.. మూడేళ్ల వయసు వచ్చేసరికి నాన్న ఏ ఆట ఆడించినా ఏ మాత్రం బెరుకులేకుండా అవలీలగా ఆడేస్తోంది.. బంతిలా పైకి ఎగరేసినా భయం లేకుండా నవ్వుతోంది.
చూడ్డానికి బాగానే ఉన్నా ఒకింత భయంగానే ఉంది. ఏమాత్రం పట్టు తప్పినా ఏమైనా ఉందా అని అనకుండా ఉండలేకపోతాం. అయితే చిన్నప్పటి నుంచి సాధన చేస్తేనే కదా ఏదైనా వచ్చేది.. సరైన జాగ్రత్తలు తీసుకుని సాధన చేస్తే ఏ ప్రమాదమూ ఉండదు.. పడిపోతామనే ఆలోచనతో ప్రారంభిస్తే నిజంగానే పడతామేమో.. పడినా లేవగలను అని ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం తప్పక వరిస్తుంది. చిన్న వయసులో సాధన కాబట్టి నాన్న సాయం కానీ, కోచ్ సాయం కానీ కంపల్సరీ. వీడియోలు చూసి ప్రాక్టీస్ లేకుండా, పక్కన ఎవరూ లేని సమయంలో, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తానంటే మాత్రం కుదరదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com