Ukraine : శిక్షణ విమానాలు ఢీకొని ముగ్గురు పైలెట్లు మృతి

Ukraine :  శిక్షణ  విమానాలు ఢీకొని  ముగ్గురు పైలెట్లు మృతి
బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించిన యుక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలో గాలిలో ఎగురుతున్న రెండు ఎల్‌-39 శిక్షణా విమానాలు ఢీకొట్టడంతో ముగ్గురు యుక్రెయన్ పైలెట్లు మృతి చెందారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు పశ్చిమాన ఉన్న జైటోమిర్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. పశ్చిమ దేశాల నుంచి అందుకున్నఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఉక్రెయిన్‌ భారీగా కసరత్తుకు సిద్ధమవుతున్నది.

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యల తర్వాత.. రెండు దేశాల సైన్యాలు క్రమం తప్పకుండా పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మొదట్లో వెనుకబడిన ఉక్రెయిన్‌.. పాశ్చాత్య దేశాల సైనిక సహాయంతో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ సైన్యం పోరాడుతున్నది. దీని ఫలితమే ఈ యుద్ధంలో ఉక్రెయిన్.. రష్యాపై ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది. యుద్ధ నేపధ్యంలో ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌ను ఎగురవేయడానికి ఉక్రేనియన్‌ సైనికులకు శిక్షణ ఇవ్వాలని చూస్తున్నారు.


ప్రమాదంలో మరణించిన ముగ్గురు మిలటరీ పైలట్లలో ఉక్రెయిన్‌ ఆర్మీ ఆఫీసర్‌ ఆండ్రీ పిల్షికోవ్ ఉన్నారు. ఆయన దేశానికి అంకితభావంతో సేవ చేశారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ముగ్గురు పైలెట్ల మరణం కోలుకోలేని నష్టమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది మనందరికీ భరించలేని, పూడ్చలేని నష్టమన్నారు.

రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్‌ వీరోచిత ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం కలిగించిన ఈ యుద్ధం ఎలా ముగుస్తుందా అని ప్రపంచం ఆశతో ఎదురు చూస్తున్నది. కానీ, అది ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు. పుతిన్‌గానీ, జెలెన్‌స్కీగానీ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. రష్యా ఓడితే అమెరికా, యూరప్‌ దేశాల పంతం నెరవేరినట్లవుతుంది. రష్యా ప్రభావం అంతర్జాతీయంగా తగ్గుతుంది. గెలిస్తే మాత్రం నాటోకు, రష్యాకు మధ్య కొత్త వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఫలితంగా మరిన్ని యుద్ధాలను ప్రపంచం చూడవలసి రావచ్చు. ఇప్పటి వరకూ జరిగిన యుద్ధాన్ని పరిశీలిస్తే మాత్రం.. రష్యాను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ పోరాట పటిమ యావత్‌ ప్రపంచానికి తెలిసి వచ్చింది. రష్యా క్షిపణుల వర్షాన్ని, వైమానిక దాడుల్ని, ఆ దేశ సైనికులు జరిపిన దారుణ మారణాకాండను తట్టుకొని ఉక్రెయిన్‌ నిలబడటం మామూలు విషయం కాదు. దీనికి ప్రధాన కారణం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ..


అతడి సారథ్యంలోని ప్రజలు, సైన్యం. మాతృభూమి రక్షణ కోసం రష్యాను అడుగడుగునా నిలువరిస్తూ పోరాడుతున్నారు. రష్యాను ఏకాకిని చేయటంలో, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టటంలో జెలెన్‌స్కీ విజయం సాధించారు. యూరప్‌ దేశాలు, అమెరికా అందిస్తున్న ఆయుధాలు, టెక్నాలజీ, ఆర్థికసాయం ఉక్రెయిన్‌ను యుద్ధరంగంలో నిలబెట్టగలిగాయి.

Tags

Read MoreRead Less
Next Story