Titan Rescue team: కాపాడాలనే వెళ్ళాం కానీ..

Titan Rescue team: కాపాడాలనే వెళ్ళాం కానీ..
రెస్క్యూ అనుకున్నాం -రికవరీ చేసాం

టైటానికి శిథిలాలను చూసేందుకు టైటాన్ సబ్ మెర్సిబుల్ లో వెళ్లిన ఐదుగురు బిలియనీర్ల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారి కోసం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతమైంది. మొక్కలైపోయిన టైటాన్ సకలాలను గుర్తించిన పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్ సంస్థ సీఈవో ఈ రెస్క్యూ మిషన్ ని గూర్చి వివరిస్తూ కన్నీరు మున్నీరయ్యారు.





ఐదుగురు ప్రయాణికులతో గత ఆదివారం కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి బయల్దేరిన టైటాన్ సబ్ మెర్సిబుల్ అట్లాంటిక్ సముద్రంలో తప్పిపోయింది.నీటిలోకి ప్రవేశించిన గంటా 45 నిమిషాలకే టైటాన్ భూఉపరితలం నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. అంతేకాకుండా అదే సమయంలో నేవిగేషన్ సిస్టమ్ కూడా క్రాష్ అయింది. ఇలా కామ్ కనెక్షన్, నేవిగేషన్ ఒకేసారి కోల్పోవడంతో అప్పుడే జరగకూడనిది జరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఆ టైటాన్ సబ్ మెర్సిబుల్ కేవలం 96 గంటల ఆక్సజన్ నిల్వతోనే సముద్రంలోకి దిగింది. జాడ కోల్పోయినప్పటి నుంచి అధికారలు కాలంతో పోటీ పడుతూ రెస్క్యూ ఆపరేషన్ ని ముందుకు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది.





టైటానిక్ సిటీలాల సమీపంలోనే టైటాన్స్ శకలాలు లభ్యమయ్యాయి. రెస్క్యూలో పాల్గొన్న పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్ బృందం వాటిని గుర్తించింది. ఈ విషయాన్ని మీడియాకు వివరిస్తూ పెలాజిక్ సీఈవో బృందానికి నాయకత్వం వహించిన ఎడ్ కసావో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టైటాన్ విషయంలో తాము చేపట్టిన రిస్క్యూ ఆపరేషన్ చివరకు శకలాల రికవరీగా ముగిసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.





సముద్ర గర్భంలోకి ప్రయాణం మొదలైన 1.45గంటల తర్వాత నీటిపై ఉన్న నౌక పోలార్ ప్రిన్స్ తో టైటాన్ మినీ జలంతర్గామి తన సంబంధాలు కోల్పోయింది. తక్షణమే వారు రిస్క్యూ విషయంలో మా సంస్థను సంప్రదించారు. మా యొక్క డీప్ వాటర్ రిమోట్లీ ఆపరేటర్ వెహికల్ ఆర్ ఓ వి, ఓడిసిఎస్ 6కే ను రంగంలోకి దించాం. టైటాన్ ను కనుగొన్న వెంటనే వీలైనంత త్వరగా పైకి రా పైకి తీసుకురావటమే మా ప్రణాళిక లక్ష్యం. కానీ మేము అక్కడికి చేరుకునేటప్పటికే అర్థం అయింది అక్కడ ఇంకా ఏమి మిగిలే అవకాశం లేదని. మేము పూర్తిగా ఆశలు కోల్పోయాం. సముద్రపు అడుగున చేరుకున్న కొద్దిసేపటికే టైటాన్ సబ్మెర్సిబుల్ శకలాలు కనుగొన్నామన్నారు. దీంతో తమ రెస్క్యూ శకలాల రికవరీగా ముగిసింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ టీం లో ఉన్న అందరూ కూడా చాలా బాధలో మునిగిపోయామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story