Astronauts: అంతరిక్షం నుంచి కిందపడిన టూల్‌కిట్ బ్యాగ్

Astronauts: అంతరిక్షం నుంచి కిందపడిన టూల్‌కిట్ బ్యాగ్
సోలార్ పరికరాలకు మరమ్మతులు చేస్తుండగా పట్టు జారిన టూల్ కిట్

వ్యోమగాముల పట్టు నుంచి జారిపోయిన ఒక టూల్ కిట్ ఇప్పుడు భూమి చుట్టూ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే, లోల్ ఓ హార్, జాస్మిన్ మోఘ్ బెలీ ఈ నెల 1న స్పేస్ వాక్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు ఉన్న సోలార్ పరికరాలకు వారు మరమ్మతులు చేశారు. రిపేర్లు చేస్తున్న సమయంలో వారి పట్టు నుంచి టూల్ కిట్ జారిపోయింది. ఇది అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది. ఆరోజు నుంచి అది తెల్లటి సంచి మాదిరి మెరుస్తూ... భూమి చుట్టూ తిరుగుతోంది. గత వారం ఫుజి పర్వతంపై నింగిలో తేలుతున్న ఈ కిట్ బ్యాగ్ ను జపనీస్ వ్యోమగాని సతోషి ఫురుకావా గుర్తించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కంటే నాలుగు నిమిషాల ముందుగా ఇది భూమి చుట్టూ తిరుగుతోంది.


నవంబర్ 1 వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు నాసా పంపించిన మహిళా వ్యోమగాములు జాస్మిన్ మోఘ్‌బెలీ, లోరల్ ఓ హారా స్పేస్ వాక్ చేశారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు ఉన్న సోలార్‌ పరికరాలకు రిపేర్‌ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న ఒక టూల్‌కిట్‌ బ్యాగ్‌ అక్కడి నుంచి జారిపోయింది. ఈ సంఘటన మొత్తం ఐఎస్‌ఎస్‌కు చెందిన కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. తెల్లని సంచి లాగా ఉన్న ఆ టూల్ కిట్ బ్యాగ్ ప్రస్తుతం ఆకాశంలో మెరుస్తోందని నాసా వెల్లడించింది. బైనాక్యులర్ ద్వారా మాత్రమే భూ కక్ష్యలో తిరుగుతున్న టూల్ కిట్ బ్యాగ్‌ను చూడవచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఆ టూల్ కిట్ బ్యాగ్.. గత వారం ఫుజి పర్వతంపై ఆకాశంలో తేలుతున్న జపనీస్ వ్యోమగామి సతోషి ఫురుకావా గుర్తించారు.

మరోవైపు అంతరిక్షంలో ప్రకాశవంతంగా కనిపిస్తున్న ఈ టూల్‌కిట్‌ బ్యాగ్‌ ఐఎస్‌ఎస్‌ కంటే 2 నుంచి 4 నిమిషాలు ముందుగా భూమి చుట్టూ తిరుగుతోందని నాసా వెల్లడించింది. అయితే ఈ టూల్ కిట్ బ్యాగ్ వల్ల ఐఎస్‌ఎస్‌కు గానీ.. అందులో ఉన్న వ్యోమగాములకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. కొన్ని నెలల పాటు భూ కక్ష్యలో తిరిగిన తర్వాత ఆ టూల్‌కిట్‌ బ్యాగ్‌ 2024 మార్చిలో భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతుందని అంచనా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story