ప్రపంచంలోని 20 చెత్త పాస్‌వర్డ్‌‌లు.. ఎక్కువమంది ఉపయోగించే పాస్‌వర్డ్ ఏంటో తెలుసా..

ప్రపంచంలోని 20 చెత్త పాస్‌వర్డ్‌‌లు.. ఎక్కువమంది ఉపయోగించే పాస్‌వర్డ్ ఏంటో తెలుసా..
ఎక్కువమంది వాడే పాస్‌వర్డ్‌ల లిస్ట్‌ని ప్రకటించింది ప్రముఖ పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ సంస్థ 'నార్డ్'.

తాళం కప్పకు కీ ఎంత అవసరమో.. పాస్‌వర్డ్ లేకపోతే పనే అవదు ఈ రోజుల్లో మొబైల్ టెక్నాలజీ, సోషల్ మీడియా వేగవంతమైన ఈ రోజుల్లో ఈ మెయిల్, ఫేస్‌బుక్, ఆఖరికి ఫోన్‌, సిస్టమ్‌కి కూడా లాక్.. ఏది ఓపెన్ చేయాలన్నా పాస్‌వర్డ్ కంపల్సరీ.. పొరపాటున మర్చిపోయామంటే అంతే సంగతులు.. పక్కవాడికి కూడా తెలియకుండా ఉండాలంటే ఓ మంచి పాస్‌వర్డ్ ఎంచుకోవాలి.

ఇలా ఎక్కువమంది వాడే పాస్‌వర్డ్‌ల లిస్ట్‌ని ప్రకటించింది ప్రముఖ పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ సంస్థ 'నార్డ్'. ఇవి 2020లో వచ్చిన అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితా అని సంస్థ పేర్కొంది. ఇందులో 123456 అనే పాస్‌వర్డ్ మొదటి స్థానంలో ఉంది. దాదాపు 2.3 కోట్ల మంది దీన్ని ఉపయోగించడం విశేషం. ఎక్కువ మంది ఉపయోగించిన పాస్‌వర్డ్ ఇదే కాబట్టి దీన్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక రెండో స్థానంలో ఉన్న పాస్‌వర్డ్ 123456789.. మూడో స్థానంలో picture1 ఉంది.

2015 లో ఒక సాప్ట్ వేర్ సంస్థ 12345 ఆ సంవత్సరపు చెత్త పాస్‌వర్డ్‌గా అభివర్ణించింది. ఐదేళ్ల తరువాత కూడా ఇప్పుడు మళ్లీ అదే పాస్‌వర్డ్ మొదటి జాబితాలో ఉంది. అన్నిటి కంటే కామెడీ పాస్‌వర్డ్ 'password' అనే పదం నాలుగో స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకునేందుకు వీలైన పాస్‌వర్డ్ లను క్రాక్ చేయడం చాలా సులభమని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో తేలింది.

'123456', '123456789', 'picture1', 'password', '12345678', '111111', '123123', '12345', '1234567890', 'senha', '1234567', 'qwerty', 'abc123', 'Million2', '000000', '1234', 'iloveyou', 'aaron431', 'password1', 'qqww1122'. ఈ జాబితాలో ఉన్న టాప్ 20 చెత్త పాస్‌వర్డ్‌‌లు ఇవి అని సంస్థ పేర్కొంది. వీటిని క్రాక్ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదట.

90 వేల మందికి పైగా వినియోగించిన పాస్‌వర్డ్‌ 'aaron431' అని తెలిపింది. ఇక chocolate అనే పదాన్ని 21,409 మంది వాడగా, pokemon అనే పాస్‌వర్డ్‌‌ను 37 వేల మంది ఉపయోగించారు.

Tags

Read MoreRead Less
Next Story