Trillion Dollar Coin: ఈ ఒక్క కాయిన్ మీ దగ్గర ఉంటే రూ.75 లక్షల కోట్లు ఉన్నట్టే..

Trillion Dollar Coin: ఈ ఒక్క కాయిన్ మీ దగ్గర ఉంటే రూ.75 లక్షల కోట్లు ఉన్నట్టే..
Trillion Dollar Coin: పాత నాణెలకు ఎంత విలువ ఉంటుందో మనందరికీ తెలుసు.

Trillion Dollar Coin: పాత నాణెలకు ఎంత విలువ ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక్కప్పటి రూపాయి నాణెం కూడా వేలం వేస్తే లక్ష రూపాయలైనా పెట్టి కొంటారు కొందరు. ఇప్పటి నాణెలకు అంత విలువ ఏమీ ఉండదు. కానీ అమెరికా మాత్రం ట్రిలియన్ డాలర్లు పెట్టి ఒక నాణెన్ని ముద్రించాలనే ఆలోచనలో ఉందట. ట్రిలియన్ డాలర్లంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 75 లక్షల కోట్లు.

ఇంతకీ అంత ఖర్చు పెట్టి నాణెన్ని తయారు చేయాలనే నిర్ణయం అమెరికా ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారా? రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా చట్టం ప్రకారం.. ప్లాటినంతో చేసిన నాణెం ద్వారా ప్రభుత్వం ఎంత రుణం అయినా తీసుకోవచ్చు.

ఈ ట్రిలియన్ డాలర్ల నాణెన్ని ఖజానాలో పెడితే ప్రభుత్వం ఎంత రుణం అయినా పొందవచ్చు. దీంతో రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఎదుర్కునే అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగంతో ముందుండే అమెరికా ఈసారి ఈ ప్రయోగంతో ఎంత సక్సెస్ సాధిస్తుందో చూడాలి..

Tags

Read MoreRead Less
Next Story