ఫలితాలు సుప్రీంకోర్టు తేలుస్తుంది: ట్రంప్

ఫలితాలు సుప్రీంకోర్టు తేలుస్తుంది: ట్రంప్
అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత

అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీరోజూ సంచలన వ్యాఖ్యలు చూస్తున్నారు. తాజాగా, అమెరికా ఎన్నికల ఫలితాలను సుప్రీం కోర్టు తేల్చే అవకాశం ఉందటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో.. అధికార బదిలీ సజావుగా సాగుతుందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలని అన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు బహుశా సుప్రీం కోర్టు తేల్చే అవకాశం ఉందని అన్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా డెమొక్రటిక్ పార్టీ పెద్ద ఎత్తున రిగ్గింగ్ పాల్పడేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బ్యాలెట్ల గురించి చాలా బ‌ల‌మైన వ్య‌తిరేక స్వ‌రాన్ని ట్రంప్ వినిపించారు. బ్యాలెట్ల‌తో చాలా నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని తీసివేస్తే.. ఎన్నిక‌లు ప్రశాంతంగా జ‌రుగుతాయ‌ని, అప్పుడు అధికార బ‌దిలీ ఉండ‌ద‌ని, కేవ‌లం కొన‌సాగింపు మాత్ర‌మే ఉంటుంద‌ని ట్రంప్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story