ట్రంప్‌ను ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి పంపించాలంటే అదొక్కటే మార్గం

ట్రంప్‌ను ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి పంపించాలంటే అదొక్కటే మార్గం
ఒకటి దేశ అధ్యక్షుడు తనంతట తాను అనుమతి ఇవ్వాలి. లేదా వైస్‌ ప్రెసిడెంట్‌ క్యాబినెట్‌ను సంప్రదించి, వారి అంగీకారంతో..

ట్రంప్‌ తనంతట తాను అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేలా లేరు. దీంతో 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగించే ఆలోచనలో ఉన్నారు. ట్రంప్‌ను ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి పంపించేయడానికి అదొక్కటే మార్గమనే చర్చ జరుగుతోంది. 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగించాలంటే రెండే దారులు ఉన్నాయి. ఒకటి దేశ అధ్యక్షుడు తనంతట తాను అనుమతి ఇవ్వాలి. లేదా వైస్‌ ప్రెసిడెంట్‌ క్యాబినెట్‌ను సంప్రదించి, వారి అంగీకారంతో కూడా ప్రయోగించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్‌.. తనంతట తానుగా అవిశ్వాసాన్ని ప్రకటించుకోలేదు. సో, బాల్ ఇప్పుడు వైస్‌ ప్రెసిడెంట్ కోర్టులో ఉంది.

25వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు అమెరికాకు ఆపద్ధర్మ అధ్యక్షుడు అవుతారు. అలా అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి నుంచి అధికారాన్ని బదలాయిస్తారు. ప్రస్తుతం అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా మైక్‌ పెన్స్‌ ఉన్నారు. 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగించాల్సింది కూడా ఈయనే. అయితే, ఇందుకు మైక్‌ పెన్స్‌ సహకరిస్తాడా ప్రశ్న కూడా తలెత్తుతోంది. పైగా మైక్‌ పెన్స్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవాలంటే.. క్యాబినెట్‌లోని సగం మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు ఉభయసభల్లోనూ మూడొంతుల మంది సభ్యులు అధ్యక్షుడి మార్పును స్వాగతించాల్సి ఉంటుంది. ఇదంతా జరిగే పనేనా అనే ఆలోచనలో పడ్డారు.

ఒకవేళ 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగించినా.. ప్రస్తుత అధ్యక్షుడు దాన్ని సవాల్ చేయవచ్చు. అమెరికా కాంగ్రెస్‌లో దీనిపై చర్చ, ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కొన్ని వారాలు పట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ట్రంప్‌ అధ్యక్ష పీఠం నుంచి తప్పుకోడానికి ఇంకా 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే అధికార బదిలీ జరగాల్సి ఉంది. కాని, ట్రంప్ మొండికేస్తుండడంతో ప్రశాంతంగా జరగాల్సిన అధికార బదిలీ.. హింసాత్మకంగా మారింది.

ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగించారు. కాని, ఈ మూడుసార్లు కూడా అధ్యక్షుడు తనకు తానుగా ప్రయోగించుకున్నదే. 1985లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్‌.. తాను సర్జరీకి వెళ్లాల్సి ఉండడంతో సీనియర్‌ బుష్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక 2002, 2007లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు జూనియర్‌ బుష్‌ 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించుకున్నారు. ఇవన్నీ సాధారణ ప్రక్రియలో భాగంగానే జరిగాయి. కాని, ట్రంప్‌ విషయంలో మాత్రం కాస్త అసాధారణంగా జరిగేలా కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story