TRUMP: నేను నిర్దోషినే.. ఇదో రాజకీయ కుట్ర

TRUMP: నేను నిర్దోషినే.. ఇదో రాజకీయ కుట్ర
వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌... పటిష్ట భద్రత వెనక డోర్‌ నుంచి న్యాయమూర్తి ముందు హాజరు..

జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేక న్యాయవాది జాక్‌స్మిత్‌ నేరారోపణలు మోపిన 2 రోజుల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump).. వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టు(federal courthouse)లో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని తారుమారు చేసేందుకు కుట్ర(2020 US Election Conspiracy Charges) చేశారన్న కేసులో తాను నిర్దోషినే అని‍(Trump Pleads Not Guilty‌) ట్రంప్‌ మెజిస్ట్రేట్‌ ముందు తెలిపారు. మెజిస్ట్రేట్‌ ప్రశ్నించినప్పుడు ట్రంప్‌ లేచి నిలుచుని సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో ఆయనపై అభియోగాలు మోపిన జాక్‌స్మిత్‌ కూడా కోర్టు హాల్‌లోనే ఉన్నారు.


2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్‌(Joe Biden) విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టులో అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ అభియోగాలను ట్రంప్‌ అంగీకరించలేదు. భారీ భద్రత నడుమ కోర్టుహాల్‌ వెనక డోర్‌ నుంచి ట్రంప్‌ ప్రవేశించారు. విచారణలో భాగంగా ట్రంప్‌ తొలుత ఎదుట తనపేరు, వయసు చెప్పారు. అనంతరం తనపై నమోదైన అభియోగాలను మెజిస్ట్రేట్‌ జడ్జి మోక్సిలా ఉపాధ్యాయ్‌(magistrate judge Moxila Upadhyaya) చదివి వినిపించారు. ఈ సందర్భంగా తాను నిర్దోషినని ట్రంప్‌ పేర్కొన్నారు.


విచారణ అనంతరం కేసు విచారణపై ట్రంప్‌ స్పందించారు. ఇది అమెరికాకు విచారకరమైన రోజనీ.. అమెరికాలో ఇలా జరుగుతుందని తానెప్పుడు అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రన్న ట్రంప్‌.. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు ట్రంప్‌ వాషింగ్టన్‌ DCకి ప్రత్యేక విమానంలో వచ్చారు. తర్వాత భారీ కాన్వాయ్‌లో వాషింగ్టన్‌ డీసీ నగరం గుండా ప్రయాణించి కోర్టు వద్దకు చేరుకున్నారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని ఆయనపై నేరాభియోగం నమోదైంది. ఇందులో ఆయన దోషిగా తేలితే ట్రంప్‌ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇదే కేసులో యూఎస్‌ క్యాపిటల్‌ భవనం(attack on the US Capitol)పై దాడి చేసిన నిందితులు 1000 మంది సైతం కోర్టులో హాజరయ్యారు. ఈకేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టు 28న ఉంది.

Tags

Read MoreRead Less
Next Story