Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ నెలకు రూ.900

Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ నెలకు రూ.900
బ్లూటిక్ కంటె ముందు ట్విట్టర్ బ్యాడ్జ్ ను పొందేందుకు కూడా అప్లై చేసుకోవాలట


టెస్లా అధినేత ఎలన్ మస్క్ 'ట్విట్టర్' కొనుగోలు చేసినప్పటి నుంచి సంచలనాలు నమోదు చేస్తున్నారు. తాజాగా, ట్విట్టర్ బ్లూ టిక్ ను వినియోగదారులు పొందాలంటే రూ.900లు చెల్లించాల్సిందేనని తెలిపారు. భారత్ లో ఈ ఆఫ్షన్ ను తీసుకురాగా... బ్లూటిక్ కంటె ముందు ట్విట్టర్ బ్యాడ్జ్ ను పొందేందుకు కూడా అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు.

బ్లూ టిక్ ను భారత్ లోనే కాకుండా, అమెరికా, కెనడా, అస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూకే, సౌదీ అరేబియా, ప్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఇండోనేషియా మరియు బ్రెజిల్ లో ఇదే తరహా కోనుగోలు నిబంధనలను అమలు చేశారు. ట్విట్టర్ వెబ్ వెర్షన్లో... బ్లూ టిక్ కోసం నెలకు రూ.650 చెల్లించాలని నివేధికలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఆప్షన్ భారత్ లో అందుబాటులో లేదని తెలుస్తోంది.

ట్విట్టర్ బ్లూటిక్ ను పొందినట్లయితే, ప్రకటనలు తక్కువగా వస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ట్వీట్ చేసిన 30 నిమిషాలలోపు ఐదు సార్లు సవరించుకోవచ్చని, పొడవైన పోస్ట్ లు పెట్టుకొవచ్చని, HD రిజల్యూషన్స్ కలిగిన వీడియోలను షేర్ చేయవచ్చని తెలిపారు. పైగా స్పామ్ ను కంట్రోల్ చేసుకునే విధంగా ఫీచర్స్ ఉండనున్నాయి. ఇప్పటికే బ్యాడ్జ్ పొందిన సభ్యులు బ్లూ టిక్ కోసం అప్లై చేసుకోవాలని ట్విట్టర్ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story