ట్విట్టర్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

ట్విట్టర్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
కొన్ని సంవత్సరాలుగా ట్విట్టర్ అకౌంట్ల ధృవీకరణలో వివాదాలు రావడంతో మూడేళ్ల క్రితం

ప్రముఖుల ఖాతాలకు ఉపయోగించే బ్లూ చెక్ మార్క్ బ్యాడ్జ్‌పై గతంలో వచ్చిన విమర్శలను పరిష్కరించడానికి ట్విట్టర్ కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. 2021 ప్రారంభంలో కొత్త పబ్లిక్ అప్లికేషన్ ప్రాసెస్‌తో సహా బ్లూ బ్యాడ్జ్ విధానాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా ట్విట్టర్ అకౌంట్ల ధృవీకరణలో వివాదాలు రావడంతో మూడేళ్ల క్రితం ఈ విధానాన్ని నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది.

ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఈ బ్లూ బ్యాడ్జ్ ఫీచర్‌పై వినియోగదారులు తమ విలువైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. కొత్త పాలసీకి సంబంధదించిన పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ నవంబర్ 27న ప్రారంభమై డిసెంబర్ 8 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. పబ్లిక్ వెరిఫికేషన్ ఫీచర్‌పై మీరు కూడా మీ అభిప్రాయాన్ని ట్వీట్ చేయాలనుకుంటే #VerificationFaceback అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి ట్విట్టర్లో పోస్ట్ చేయాలని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story