Twitter Row: ఉద్యోగులను అలా తీసేశాడు..

Twitter Row: ఉద్యోగులను అలా తీసేశాడు..
ట్విట్టర్ మాజీ ఉద్యోగి అంతరంగం

ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ట్విట్టర్ ఎలా మార్పుకు గురైందో తెలిపారు ఆ సంస్థ మాజీ ఉద్యోగి యష్ అగర్వాల్. మీడియాతో మాట్లాడిన ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. గుగుల్, అమెజాన్, ట్విట్టర్ వంటి బిగ్ టెక్ కంపెనీల నుంచి తొలగింపులకు గురైన ఉద్యోగులు అనిశ్చితికి గురవుతున్నారని అన్నారు. ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఉద్యోగులను ఇంటికి పంపిన తీరు ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. ఎటువంటి నోటీసులూ లేకుండా ఉద్యోగులను మస్క్ తొలగించారని అన్నారు. నవంబర్ ప్రారంభంలో అకస్మాత్తుగా వేలాది ఉద్యోగులు తమ ఈ మోయిల్స్, బ్యాడ్జ్, స్లాక్ యాక్సెస్ కోల్పోయారని చెప్పారు.

ఉద్యోగం పోయిన మెయిల్ ను చదివి తాను నిద్రపోయానని అన్నారు అగర్వాల్. ట్విట్టర్ లో భాగమైనందుకు తాను కృతజ్ఞుడనని అన్నారు. పని పూర్తయినంత కాలం మేనేజర్లు తమతో బానే ఉన్నారని, షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఉండేవి కావని తెలిపారు. ఎప్పుడైతే మస్క్ ట్విట్టర్ ను దక్కించుకున్నారో అప్పటినుంచి షిఫ్ట్స్ తోపాటు అధిక సమయం పనిచేయాల్సి వచ్చేదని చెప్పారు.

తొలగింపులకు గురైన సహచర ఉద్యోగులతో టచ్ లో ఉన్నట్లు అగర్వాల్ తెలిపారు. అందులో కొందరికి వేరే కంపెనీలలో ఉన్నతమైన ఉద్యోగాలు లభించాయని, మరికొందరు సొంతంగా కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించారని అన్నారు. ట్విట్టర్ ఉద్యోగులు మస్క్ నిబంధనలు భరించలేక బయటకు వస్తున్నారని తెలిపారు. ఉద్యోగులను చెప్పాపెట్టకుండా తీసేస్తున్న కంపెనీలు సకాలంలో వేతనాలు ఇవ్వాలని అన్నారు. ట్విట్టర్ ఇప్పటికీ కొందరికి వేతనాలు చెల్లించలేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story