చైనాను వణికించిన "డొక్సురి"

చైనాను వణికించిన డొక్సురి
రికార్డుస్థాయిలో వర్షపాతం... వరదలో మునిగిపోయిన అనేక ప్రాంతాలు...

చైనా పుజియాన్ ప్రావిన్స్‌లోని అనేక నగరాలను డొక్సురి తుపాను(typhoon Doksuri ) వణికించింది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న వర్షపాతంతో చైనీయులు వణికిపోతున్నారు. గడచిన 48 గంటల్లో నగరంలో 500 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం( tropical storm) నమోదైంది. భారీ వర్షాల(heavy winds and rain ) కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక వాహనాలు వరద నీటి(storm flooded streets )లో కొట్టుకుపోయాయి. పలు అపార్ట్‌మెంట్‌లు, భవనాలలో భారీగా వరద నీరు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. తీగలు తెగిపడి వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా ఉన్న నదిలో నీటి మట్టం విపరీతంగా పెరగడంతో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


దక్షిణ చైనాలో పది లక్షల కంటే ఎక్కువమంది(Over a million households ) ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దక్షిణ ఫుజియాన్ ప్రావిన్స్‌లో 4 లక్షల మంది ప్రజల(400,000 people were evacuated,)ను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్‌ స్తంభాలు( toppled electric transmission towers) నేలకూలాయి. వ్యాపారాలు, పాఠశాలలను మూసేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ తీరంలోని క్వాన్‌జౌ నగరంలో దాదాపు 50 మంది వ్యక్తులకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని, చెట్లు నేలకూలాయని అధికారులు తెలిపారు.


పసిఫిక్ మహాసముద్రంలో డొక్సురి భీకర టైఫూన్( typhoon) ఏర్పడింది. దీని ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తొలుత ఫిలిప్పీన్స్‌పై డొక్సురి తుపాను పంజా విసిరింది.ఈ తుఫాను ప్రభావంతో ఫిలిప్పీన్స్‌ లో వరదలు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందుజాగ్రత్తగా పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు. ఉత్తర ప్రావిన్సులలోని వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉత్తర కాగయాన్ ప్రావిన్స్ గవర్నర్ మాన్యువల్ మాంబా అలలు ఎగిసిపడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story