Sheikh Khalifa : యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా కన్నుమూత
Sheikh Khalifa : అబుదాబి : యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందారు. ఈ మేరకు అధ్యక్షవ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.

Sheikh Khalifa : అబుదాబి : యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందారు. ఈ మేరకు అధ్యక్షవ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నవంబర్ 3, 2004 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయన తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వారసుడిగా ఎన్నికయ్యారు. సుల్తాన్ 1971 నుంచి నవంబర్ 2, 2004 వరకు మరణించే వరకు యూఏఈ మొదటి అధ్యక్షుడిగా సేవలందించిన విషయం తెలిసిందే. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా యూఏఈ రెండో అధ్యక్షుడిగా, అబుదాబి ఎమిరేట్ 16వ పాలకుడు.
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాలనలో యూఏఈ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించారు. అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత పౌరుల శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధిని సాధించింది. నార్తర్న్ ఎమిరేట్స్ అవసరాలను అధ్యయనం చేయడానికి యూఏఈ అంతటా విస్తృతంగా పర్యటించడంతో పాటు గృహ నిర్మాణం, విద్య, సామాజిక సేవలకు సంబంధించి అనేక ప్రాజెక్టులకు సంబంధించి సూచనలు చేశారు. ఫెడరల్ నేషన్ కౌన్సిల్ సభ్యుల కోసం నామినేషన్ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ చూపారు.
40 రోజులపాటు సంతాప దినాలు
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినందుకు అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. జాతీయ జెండాలను సగం వరకు అవగతనం చేయడంతోపాటు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సమాఖ్య, స్థానిక సంస్థలను నేటి నుండి మూసివేయనున్నారు.
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT