Putin : నో చెప్పలేదు.. కానీ ఎస్ కూడా కాదు

Putin : నో చెప్పలేదు.. కానీ ఎస్ కూడా కాదు
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై పుతిన్ స్పందన

ఉక్రెయిన్‌ తో శాంతి చర్చలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల ఆలోచనను తాను తిరస్కరించనని పుతిన్ అన్నారు.అయితే ఈ పని జరగాలి అంటే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమన్నారు. ఓ పక్క ఉక్రెయిన్ సైన్యం దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణ పాటించడం కష్టమని చెప్పారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆఫ్రికా నాయకులతో సమావేశం తర్వాత పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌ తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమించి శాంతి చర్చలు జలపాలని ఆఫ్రికా దేశాలు రష్యాని సూచించిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఆఫ్రికా, చైనా చొరవ శాంతి స్థాపనకు ఒక ప్రాతిపదిక కాగలదని చెప్పారు.

దూకుడుగా ఉన్న ఉక్రెయిన్ ఆర్మీ దాడులు చేస్తోందాన్నారు. పెద్ద ఎత్తున వ్యూహాత్మక ఆపరేషన్‌ను వారే చేపడుతున్నారని, తాము దాడికి గురయ్యామన్నారు. అలాంటి సమయంలో కాల్పుల విరమణను అమలు చేయడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. శాంతి చర్చలు జరిపే అంశంపై మాట్లాడుతూ చర్చలను తాము తిరస్కరించడం లేదని, . ఈ ప్రక్రియ ప్రారంభించాలంటే, రెండువైపులా ఏకాభిప్రాయం అవసరం అని చెప్పుకొచ్చారు. అవతలి పక్షం కొన్ని ముందస్తు షరతులకు అంగీకరిస్తే తప్ప తాము చర్చలకు రాబోమమని రష్యా, యుక్రెయిన్ రెండూ గతంలో ప్రకటించాయి.

Tags

Read MoreRead Less
Next Story