Peon post: ప్యూన్ ఉద్యోగం కోసం 15 లక్షల మంది దరఖాస్తులు.. ఎక్కడంటే?

Peon post: ప్యూన్ ఉద్యోగం కోసం 15 లక్షల మంది దరఖాస్తులు.. ఎక్కడంటే?
Peon post: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశంలో నిరుద్యోగం రేటు 6.5 శాతంగా ఉందని పేర్కొన్నప్పటికీ, డేటా పరంగా మాత్రం వేరే విధంగా చూపిస్తుంది.

Peon post: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశంలో నిరుద్యోగం రేటు 6.5 శాతంగా ఉందని పేర్కొన్నప్పటికీ, డేటా పరంగా మాత్రం వేరే విధంగా చూపిస్తుంది. పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ (PIDE) ప్రకారం, నిరుద్యోగ రేటు 16 శాతం కంటే ఎక్కువగా ఉంది. దేశంలో కనీసం 24 శాతం మంది విద్యావంతులు నిరుద్యోగులుగా ఉన్నారని PIDE పేర్కొంది. ఇటీవల ఆ దేశంలోని ఒక హైకోర్టులో ప్రకటించిన ప్యూన్ ఉద్యోగం కోసం ఏకంగా 1.5 మిలియన్ల మంది అప్లై చేసుకున్నట్టుగా ఈ దేశ మీడియా పేర్కొంది. అయితే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంఫిల్ డిగ్రీ హోల్డర్లు ఉన్నారు. కాగా పాకిస్తాన్‌ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పిబిఎస్) ప్రచురించిన ఒక సర్వే ప్రకారం, పాకిస్తాన్‌లో నిరుద్యోగం 2017-18లో 5.8 శాతం నుండి 2018-19లో 6.9 శాతానికి పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story