US: అమెరికాలో చైనీస్ స్పై బెలూన్ కలకలం

US: అమెరికాలో చైనీస్ స్పై బెలూన్ కలకలం
న్యూక్లియర్ లాంచ్ సైట్ వద్ద కపించిన చైనీస్ స్పై బెలూన్; పేలిస్తే ప్రమాదమని భావిస్తున్న భద్రతా దళాలు

అమెరికాలోని మాంటానాలో న్యూక్లియర్ లాంచ్ ఫెసిలీటీ వద్ద ఆకాశంలో అకస్మాత్తుగా తటస్థించిన చైనీస్ స్పై బెలూన్ స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఇది మామూలు స్పై బెలూన్ కాదని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. అందుకే బెలూన్ ను వెంటనే పేల్చివేయకుండా నిరీక్షస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బెలూన్ ను పేల్చివేస్తే దాని ద్వారా చెలరేగే మంటలు, బెలూన్ శిధిలాల వల్ల మాంటానాలోని ప్రజానీకానికి హాని వాటిల్లే ప్రమాదముందని పెంటగాన్ సభ్యులు భావిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ఓ చైనా బెలూన్ సంచరిస్తోందని, దీని వల్ల అత్యంత గోప్యమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని పెంటగాన్ సభ్యుడు తెలిపాడు. మరోవైపు ప్రభుత్వం బెలూన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఏ దిశగా ప్రయాణిస్తోంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియల్ ఎయిర్ ట్రాఫిక్ మీదుగా ప్రయాణిస్తోన్న ఈ బెలూన్ ప్రస్తుతానికి అటు సైన్యానికి, ఇటు ప్రజలకు హాని చేసే విధంగా లేదని స్పష్టం చేశారు. గతంలోనూ ఇదే విధంగా ఈ ప్రాంతంలో కొన్ని బెలూన్ లు కనిపించాయని, అయితే ప్రభుత్వం వారికి ఎంలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story