US: ఆకాశంలో ఎగురుతున్న వస్తువును కూల్చేసిన అమెరికా దళాలు

US: ఆకాశంలో ఎగురుతున్న వస్తువును కూల్చేసిన అమెరికా దళాలు
అలాస్కాలో కారు ఆకారంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని వైట్‌హౌస్‌ తెలిపింది

అమెరికాలో మరో గగనతల ఉల్లంఘన ఉదంతం చోటుచేసుకుంది. అలాస్కాలో కారు ఆకారంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని వైట్‌హౌస్‌ తెలిపింది.సివిల్‌ ఏవియేషన్ కు కాస్తంత ఇబ్బందిగా ఉన్న వస్తువును కూల్చేశామని, శిథిలాలను వెతికే పనిలో ఉన్నామని పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ బ్రిగేడియర్‌ జనరల్‌ ప్యాట్‌ రైడర్‌ చెప్పారు.

40వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువును నిశితంగా పరిశీలించాక అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాల మేరకు యుద్ధవిమానం కూల్చేసింది. అది గడ్డ కట్టిన అమెరికా సముద్రజలాల్లో పడిందిని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్‌ జాన్‌ కిర్బీతెలిపారు.ఇటీవలే చైనా నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చేసింది. అయితే ఇప్పుడు అమెరికా గగనతలంలో ఎగిరిన వస్తువు ఏం చేసిందనేది ఇంకా తెలియలేదని అమెరికా భద్రతా దళాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story