US Independence Day: అమెరికా స్వాతంత్ర దినోత్సవం

US Independence Day: అమెరికా స్వాతంత్ర దినోత్సవం
247వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న అమెరికా

అగ్రరాజ్యం బానిస పాలన నుంచి విముక్తి పొందిన రోజు జూలై 4. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం చేతి నుంచి బయటపడి 247 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా అమెరికాలో ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు.




బ్రిటీష్‌ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురైన తరువాత అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. నిజానికి అమెరికా జూలై 04 న సంపూర్ణ స్వాతంత్య్రం పొందినప్పటికీ, ఈ ప్రక్రియ జరగడానికి రెండు రోజుల క్రితం అనగా జులై 02 న కాంటినెంటల్‌ కాంగ్రెస్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించేందుకు ఓటింగ్‌ నిర్వహించింది. ఆ రోజున దాదాపు12 అమెరికా కాలనీలు అధికారికంగా బ్రిటీష్‌ పాలన నుంచి విడిపోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాయి. కానీ మొత్తంగా అధికారికంగా స్వాతంత్ర్యం పొందినది మాత్రం నాల్గవ తేదీనే. అప్పటి నుంచి అదే రోజున స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంతున్నారు. ఈ వేడుకలు 1801లో తొలిసారిగా వైట్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి. బాణసంచా కాల్పులు, క్రీడలు, తుపాకుల వందనాలు, ఫైరింగ్‌ మొదలగువాటితో అమెరికాలో నలుమూలల ఉన్న ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.

ప్రస్తుతం అమెరికా 247వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ రోజు కవాతుల ప్రదర్శన, బాణసంచా కాల్పులు, కార్నివాల్‌లు తదితరాలతో అమెరికన్లు పండగ చేసుకుంటారు. ఇంగ్లీష్ భాషలో మనకు బాగా తెలిసిన మొట్టమొదటి వాక్యాలలో ఒకటి కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. భారతదేశానికి రావడానికి యూరప్ నుండి బయలుదేరినప్పుడు, అతను అనుకోకుండా అమెరికాకు చేరుకున్నాడని చెబుతారు. కొలంబస్ తన దేశస్థులకు అమెరికా గురించి చెప్పినప్పుడు ఆ దేశం స్వాధీనం కోసం చాలా దేశాల మధ్య పోరాటం జరిగింది. అయితే బ్రిటిష్ వారు అత్యధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని, అమెరికాను స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలు కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా కూడా చాలా ఏళ్ళు బ్రిటిష్ వారికి బానిసగా ఉంది. కొన్ని సంవత్సరాల తీవ్రమైన పోరాటం తరువాత బానిస సంకెళ్లు తెంచుకుంది.





జూలై 4, 1977న, మొదటిసారిగా తుపాకీల గౌరవ వందనాలతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. బాణసంచా కాల్చడం కూడా ఈ రోజు నుంచే మొదలైంది. 1801లో వైట్ హౌస్ అధికారికంగా జూలై 4ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించింది. అమెరికా స్వాతంత్ర్యం కోసం పోరాడిన జనరల్ జార్జ్ వాషింగ్టన్ అమెరికాకు మొదటి అధ్యక్షుడయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story