USA : రహస్య ఆయుధాలు ధ్వంసం చేసుకున్న అమెరికా

USA : రహస్య ఆయుధాలు ధ్వంసం చేసుకున్న అమెరికా
కెమికల్ వెపన్స్ లేని ప్రపంచంలోకి అడుగు పెట్టాం అన్న బైడెన్

చివరి విడత రసాయన ఆయుధాలను అమెరికా పూర్తిగా ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. రసాయన ఆయుధాల కన్వెన్షన్ లో సంతకం చేసి, రసాయన ఆయుధాల నిల్వలను నాశనం చేశామని బైడెన్ పేర్కొన్నారు. కెంటుకీలోని యుఎస్ ఆర్మీ ఫెసిలిటీ అయిన బ్లూ గ్రాస్ ఆర్మీ డిపోలో ఉన్న 500 టన్నుల ప్రాణాంతక రసాయన ఆయుధాలను నిర్మూలించే పనిని పూర్తి చేశాక బిడెన్ ఈ ప్రకటన చేశారు.




పేరుకుపోయిన రసాయన ఆయుధాలను సమూలంగా నిర్మూలించాలని దశాబ్దాల తరబడి ప్రచారం సాగుతోంది. 1997లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ రసాయన ఆయుధాల ఒప్పందం కింద అమెరికా తన వద్ద మిగిలివును రసాయన ఆయుధాలను నిర్మూలించడానికి సెప్టెంబరు 30 తుది గడువు. అందుకే వీటినిపూర్తిగా నిర్మూలించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ఒప్పందంపై 193 దేశాలు సంతకాలు చేశాయి. 1940ల నుండి ఆయుధ డిపోల్లో దాచుతూ వచ్చిన ప్రాణాంతకమైన విష పదార్ధం జిబి నెర్వ్‌ ఏజెంట్‌ను నింపిన ఎం55 రాకెట్‌లను కెంటకీలో ఇప్పటికే ధ్వంసం చేశారు. దక్షిణ కొలరాడలో ఆయుధ డిపోలో ఆయుధాల విధ్వంసాన్ని 2016లో ప్రారంభించగా జూన్‌ 22తో పూర్తయింది. ఇక్కడ మొత్తంగా 2600టనుుల మస్టర్డ్‌ ఏజెంట్‌ను వారు ధ్వంసం చేశారు. మస్టర్డ్‌ ఏజెంట్‌ను నింపిన శతఘిు తూటాలను రోబోల సాయంతో నిర్వీర్యం చేసి, వెయ్యి డిగ్రీల అధిక ఉష్ణోగ్రత వద్ద మండించారు. దాంతో ఇవి కేవలం తుక్కులా మారాయని అధికారులు తెలిపారు.. మొదటి ప్రపంచ యుద్ధంలో మొదటిసారిగా వీటిని ఉపయోగించారు. వీటి వాడకంతో లక్ష మంది మరణించారని భావించారు.



ఆ తర్వాత జెనీవా ఒప్పందం కుదుర్చుకుని వీటిని నిషేధించినా దేశాలు వీటిని నిల్వ చేసుకోవడం కొనసాగించాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రసాయన ఆయుధాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశామని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. విధ్వంసక ఆయుధాల మొత్తం వర్గాన్ని నాశనం చేసినట్లు అంతర్జాతీయ సంస్థ ధృవీకరించడం ఇది మొదటిసారి అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

రష్యా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రసాయన ఆయుధాల నిల్వలు కలిగి ఉన్నది అమెరికా. రష్యా తన సొంత నిల్వలను 2017 లోనే నాశనం చేసింది. ఏప్రిల్ 2022 నాటికి అమెరికా వద్ద 600 కంటే తక్కువ నెలలు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story