Putin: అమెరికా ప్ర‌జాస్వామ్య దేసమే కాదన్న పుటిన

Putin: అమెరికా ప్ర‌జాస్వామ్య దేసమే కాదన్న పుటిన
రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే విసుర్లు

అమెరికాపై ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా ప్ర‌జాస్వామ్య దేశం కాదు అని ఆయ‌న అన్నారు. తాజాగా జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విక్ట‌రీ సాధించిన త‌ర్వాత పుతిన్‌ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల యావ‌త్ ప్ర‌పంచ దేశాలు న‌వ్వుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. తాము చాలా సంయ‌మ‌నంతో ఉన్నామ‌ని, కానీ అమెరికాలో విపత్తు ఉంద‌ని, అది ప్ర‌జాస్వామ్య దేశం కాదు అని పుతిన్ ఆరోపించారు.

అమెరికా స‌ర్కార్ త‌న వ‌ద్ద ఉన్న అన్ని అధికారాల‌ను వాడుకుని.. దేశాధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న వ్య‌క్తిపై దాడి చేస్తోంద‌ని ఆరోపించారు. డోనాల్డ్ ట్రంప్‌ను బైడెన్ ప్ర‌భుత్వం వేధిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అభ్య‌ర్థి రేసులో ట్రంప్ ముందు వ‌రుస‌లో ఉన్నా.. ప్ర‌భుత్వం మాత్రం కేసులతో నిర్వీర్యం చేస్తోంద‌న్నారు. విదేశీ ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకోదు అని, అమెరికా అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎన్నికైనా వారితో ర‌ష్యా క‌లిసి ప‌నిచేస్తుంద‌న్నారు.

ష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 87.97 శాతం ఓట్లతో విజయం సాధించారు. ర‌ష్యాలో మూడు రోజుల పాటు పోలింగ్ జరిగింది. మొత్తం 60 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది. అధ్య‌క్షుడిగా మ‌రోసారి ఎన్నికైన త‌ర్వాత పుతిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ర‌ష్యా, నాటో మిలిటరీ కూటమి మధ్య యుద్ధం జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఈ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవ‌డం లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ప్రపంచంలో అన్నీ సాధ్యమేనన్నారు.

ఉక్రెయిన్‌తో ర‌ష్యా యుద్ధం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు ఫ్రాన్స్ తో పాటు ఇంగ్లండ్‌ను ఎంచుకున్నామ‌ని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌తో జ‌రుగుతోన్న యుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఇటువంటి ఆలోచన త‌మ‌కు ఎన్న‌డూ రాలేదని అన్నారు. కాగా, మార్చి 15 నుంచి 17 వ‌ర‌కు రష్యా ఎన్నికలు జ‌రిగాయి. ఇదే స‌మ‌యంలో ఉక్రెయిన్ రష్యాపై దాడులను పెంచింది. ర‌ష్యా సరిహద్దు ప్రాంతాలపై దాడులు జ‌రిగాయి. దీంతో ర‌ష్యా మ‌రింత ఆగ్ర‌హంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story