Long Covid : లాంగ్ కోవిడ్ తో దెబ్బతిన్న మెదడు?

Long Covid : లాంగ్ కోవిడ్ తో  దెబ్బతిన్న మెదడు?
ప్రియాన్ వ్యాధితో వ్యక్తి మృతి

కరోనా మహ్మమారి ప్రపంచాన్ని గడగడ లాడించిన విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది లాంగ్ కోవిడ్ తో బాధపడుతూనేవున్నారు. సుదీర్ఘ కాలం కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యాక్సినేషన్ డెవలప్ చేసినా కూడా రూపాలు మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్న వారిలో అవయవాలు ఎక్కువగా దెబ్బతింటున్నట్లు గుర్తించారు. ఎంఆర్ఐ స్కానింగ్ ల ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. సుదీర్ఘ కాలం కోవిడ్ తో బాధపడుతున్న వారిలో ఊపరితిత్తులు, మెదడు, కిడ్నీలు దెబ్బతింటున్నట్లు ఎంఆర్ఐ స్కానింగ్ ల ద్వారా నిర్ధారించారు. లాంగ్ కోవిడ్ కు తీవ్ర ఆరోగ్య సమస్యలకు లింకు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు తాజాగా ప్రాణాంతక ప్రియాన్ వ్యాధికి కూడా కోవిడ్ 19తో సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది.


అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ ప్రకారం.. 62 ఏళ్ల వ్యక్తి న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ క్వీన్స్ హాస్పిటల్ సెంటర్‌లో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. క్రమక్రమంగా చిత్త వైకల్యం అంటే డెమెన్షియా వంటి లక్షణాలు బయటపడ్డాయి. కోవిడ్ 19 పాజిటిల్ తర్వాత ఆయన నాడీ సంబంధిత పనితీరు క్షీణించిందని పేర్కొంది. రోగికి చివరకు ప్రియాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అయితే కోవిడ్ 19 దీనికి కారణమైందా..? అనే అనుమానం కలుగుతోంది. రోగికి మెదడు పనితీరు పరిశీలించేందుకు సీటీ, ఎంఆర్ఐ స్కాన్లు నిర్వహించారు. అయితే ఈ రెండు పరీక్షలను రెండు సార్లు నిర్వహించారు. అయితే వీటిలో ఎలాంటి వ్యాప్తి లేకుండా నార్మల్ గానే ఉన్నాయి. అయినప్పటికీ అతని పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఆస్పత్రిలో చేరిన 3 వారాల తర్వాత రోగి క్రమంగా మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు, మెత్తని ఆహారాన్ని తినడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. 6 వారాల తర్వాత రోగి మరణించాడు. ఈ నివేదికలో వైద్యులు కోవిడ్, న్యూరోడెజెనరేటివ్ పరిస్థితుల మధ్య సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.


ప్రియాన్ వ్యాధి అరుదైన న్యూరోడెజనరేటివ్ డిజార్డర్. ఇది మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా నాడీకణాల నష్టంతో సంబంధం ఉన్న లక్షణమైన స్పాంజిఫార్మ్ మార్పులను, వాపును ప్రేరేపిస్తుంది. దీంతో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. నడకలో మార్పులు, భ్రాంతి, కన్ఫ్యూషన్, కండరాల ధడత్వం తగ్గడం, అలసట, మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ తర్వాత ప్రియాన్ వ్యాధితో రోగి మరణించడం ఇది మొదటిసారి కాదని నివేదికలో వైద్యులు తెలిపారు. కోవిడ్ సోకిన తర్వాత ముగ్గురు రోగుల్లో ఇలా జరిగిందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story