America : నిదురిస్తున్న మహిళల పాదాలు తాకుతూ

America : నిదురిస్తున్న మహిళల పాదాలు తాకుతూ
యునైటెడ్ స్టేట్స్ లో వింత సైకో అరెస్ట్

అమెరికాలో నెవాడోలో ఓ వింతైన, వికృతమైన ఆలోచన కలిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళల ఇంట్లోకి చొరబడి, వారు నిద్రిస్తున్న సమయంలో వారి పాదాలను నిమరే అలవాటు ఉన్న ఓ వ్యకిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని 26 ఏళ్ల ఆంథోనీ గొంజాలెస్ గా గుర్తించి అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే

జూలై 1 మరియు 3వ తేదీల మధ్య తెల్లవారుజామున అన్‌లాక్ చేయబడిన స్క్రీన్ తలుపుల ద్వారా ఆంథోనీ రెండు స్టేట్‌లైన్ రిసార్టుల్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న మహిళ పాదాలు నిమిరాడు. ఒక్కసారిగా మహిళలు లేచి ప్రతిదాడి చేసేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. రెండు మూడు రోజులు ఇదే వరుస. ఈ ఘటనకు ముందు కూడా ఆ ప్రాంతంలోని మహిళలందరిపై ఈ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన మహిళలందరూ కలిసి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం ఆరా తీశారు. అయితే.. వేలి ముద్రల ఆధారంగా ఆగష్టు 1న అతన్ని గుర్తించి అరెస్టు చేసినట్లు అమెరికా షెరీఫ్ విభాగం ఫేస్‌బుక్‌లో తెలిపింది. ఫోరెన్సిక్ టెక్నిక్‌ల ద్వారా అతడిని గుర్తించగలిగారని డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

నిందితున్ని ఆంథోని గొంజాలెస్‌గా గుర్తించారు. ఇతడు ఇంతకుముందే ఇలాంటి ఘటనల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మహిళల బూట్లు దొంగిలించిన ఘటనల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో లైంగిక స్వయంతృప్తి చెందుతున్నాడనే ఫిర్యాదులు కూడా ఇతనిపై వచ్చాయని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story