Donald Trump: నిక్కి హేలిని ఎగతాళి చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump: నిక్కి హేలిని ఎగతాళి చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌
మాజీ అధ్యక్షుడి తీరుపై జో బైడెన్ విమర్శలు

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌, హేలీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఇటీవల మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో నిక్కి హేలిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యంగ్యంగా విమర్శలు చేశారు. విదేశాల్లో ఉన్న ఆమె మిలటరీ భర్త వెంట లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ హేలిభర్త ఎక్కడ? అంటూ ఎగతాళి చేశారు. దీనిపై స్పందించిన హేలి సైనిక కుటుంబాలను అవమానించే వ్యక్తికి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉండే అర్హత లేదని దీటుగా బదులిచ్చారు.

సైనిక విధుల్లో భాగంగా నిక్కీ భర్త మేజర్‌ మైఖేల్‌ హేలీ విదేశాల్లో ప్రస్తుతం ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె గుర్తుచేస్తూ సైనిక కుటుంబాలను ట్రంప్‌ ఆవమానిస్తున్నారని మండిపడ్డారు. మేజర్‌ మైఖేల్‌ హేలీ.. గత జూన్‌ నుంచి ‘హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా’ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై స్పందించిన హేలి‘డొనాల్డ్‌.. ఏదైనా చెప్పాలనుకుంటే.. నా వెనుక కాకుండా.. చర్చా వేదికలో నా ముందు చెప్పండి... సైన్యంలో నా భర్త సేవలు నాకు ఎంతో గర్వకారణం. 75 ఏళ్లు దాటిన రాజకీయ నేతలకు మానసిక సామర్థ్య పరీక్షలు అవసరమని నేను ఎప్పుడో చెప్పాను.. వాటిలో ట్రంప్‌ పాస్‌ కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ, ఒక సైనికుడి సేవలను గేలి చేస్తే అధ్యక్ష పదవి సంగతి అటుంచితే.. డ్రైవింగ్‌ లైసెన్సు పొందే నైతికహక్కు కూడా ఉండదు. దేశం కోసం మైఖేల్ సేవలు అందిస్తున్నారు. సైనిక కుటుంబాలను పదేపదే అవమానించే వారు దేశ సర్వసైన్యాధిపతి పదవిని చేపట్టడానికి అనర్హులు’ అని వ్యాఖ్యానించారు.


ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నేత జో బైడెన్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. సైనికులంటే అతడు బానిసలని భావిస్తాడని, ఈ వ్యక్తి ముఖానికి దేశ సేవకున్న విలువేంటే తెలియదు అని ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. ‘మేజర్ హేలీ విదేశాల్లో ఉన్నారు.., ప్రస్తుతం తన దేశానికి సేవ చేస్తున్నాడు.. ట్రంప్ మాత్రం సైనికులను తక్కువ అని భావిస్తున్నాడని మాకు తెలుసు.. కానీ అతడికి తన దేశానికి చేసే సేవ గురించి తెలియదు. దాని విలువ ఏంటో తెలియదు’ అని విమర్శించారు. హేలీ తన ప్రత్యర్థి పార్టీ నాయకురాలైనా.. సైనికుల సేవలను హేళన చేయడంతో అధ్యక్షుడు బైడెన్ స్పందించారు.

Tags

Read MoreRead Less
Next Story