US Prez: అగ్రరాజ్యంలో కీలక దౌత్యవేత్తగా భారతీయుడు; రిచ్ వర్మ ను నామినేట్ చేసిన బైడెన్!

US Prez: అగ్రరాజ్యంలో కీలక దౌత్యవేత్తగా భారతీయుడు; రిచ్ వర్మ ను నామినేట్ చేసిన బైడెన్!
అమెరికా ప్రభుత్వంలో భారతీయుల ఉనికి క్రమంగా పెరుగుతున్న వైనం. ఒబామా నుంచి బైడెన్ వరకూ భారత దౌత్యవేత్తలకు పెద్ద పీట వేస్తున్నవారే...

US Prez: అగ్రరాజ్యంలో కీలక దౌత్యవేత్తగా భారతీయుడు; రిచ్ వర్మ ను నామినేట్ చేసిన బైడెన్!


అమెరికా ప్రభుత్వ నియామకాల్లో భారతీయులకు పెద్ద పీట వేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. తాజాగా భారత్-అమెరికన్ న్యాయ దౌత్యవేత్త రిచ్ వర్మాను డిప్యుటీ సెక్రెటరీ పదవికి నామినేట్ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నామినేషన్ గనుక అర్హత సాధిస్తే రిచ్ వర్మా అగ్రరాజ్యంలో కీలక పదపిని కైవసం చేసుకున్నట్లే.


ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సంస్థలో ఛీఫ్ లీగల్ ఆఫీసర్, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ గా వ్యవహరిస్తున్నారు 54ఏళ్ల రిచ్ వర్మా. దౌత్యవేత్త స్థానానికిి నామినేట్ అవ్వడానికి ముందు 2015 నుంచి 2017 వరకూ భారత్ కు యూఎస్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఒబామా ప్రభుత్వ హయాంలో అమెరికా శాశనసభ వ్యవహారాలకు అసిస్టెంట్ సెక్రెటరీగా సేవలు అందించారు.

గతంలో ఎన్నో ప్రముఖ సంస్థల్లో పనిచేసిన రిచ్ వర్మా అమెరికా ఎయిర్ ఫోర్స్ లోనూ జడ్డ్ అడ్వొకేట్ గా విధులు నిర్వరించారు. జార్జ్ టౌన్ యూనివర్శిటీ నుంచి డిస్టింక్షన్ లో LL.M పూర్తి చేసిన వర్మా, అక్కడే పీహెచ్డీ(Phd) పట్టా కూడా అందుకున్నారు.



Tags

Read MoreRead Less
Next Story