గడువుకంటే ముందే వ్యాక్సిన్ టార్గెట్‌ను చేరుకున్న అమెరికా..

గడువుకంటే ముందే వ్యాక్సిన్ టార్గెట్‌ను చేరుకున్న అమెరికా..
అధికారం చేపట్టిన 100 రోజుల్లో 100 మిలియన్ల టీకా డోసులు వేయించాలని అధ్యక్షుడు జో బైడెన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అంతకంటే ముందే ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా వ్యాక్సిన్ టార్గెట్‌ను గడువుకంటే ముందుగానే చేరుకుంది. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 100 మిలియన్ల టీకా డోసులు వేయించాలని అధ్యక్షుడు జో బైడెన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అంతకంటే ముందే ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. అంతేకాదు మరో 100 మిలియన్ వ్యాక్సిన్ డోసులను అదనంగా ఇచ్చారు.

మొత్తం 200 మిలియన్ డోసుల్ని ను వంద రోజుల గడువుకంటే వారం రోజుల ముందే పూర్తిచేసింది అమెరికా. దీనిపై సంతోషం వ్యక్తం చేశారు అధ్యక్షుడు జో బైడెన్ ఇది అసాధారణ విజయంగా ఆయన అభివర్ణించారు. లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

వంద రోజుల్లో 200 మిలియన్ల టీకా డోసులు వేయడంతో కరోనాను కంట్రోల్ చేయగలమని బైడెన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొవిడ్ కేసులు ఎక్కువున్న దేశాల లిస్టులో అమెరికా ఇప్పటికీ టాప్‌ వన్‌లోనే ఉంది. అమెరికాలో ఇంతవరకు 3 కోట్ల 26 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5 లక్షల 83 వేలకుపైగా జనం ప్రాణాలు కోల్పోయారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం... తొలి వందరోజుల్లోనే వంద మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని ప్రకటించారు బైడెన్‌. అయితే నిర్ధేసించుకున్న గడవుకు ముందే.. వంద మిలియన్‌ డోసుల టీకా పంపిణి ప్రక్రియ పూర్తైంది. అమెరికాలో దాదాపు నాల్గోవంతుకుపైగా ప్రజలు కోవిడ్‌ టీకాను తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story